Hanuman Photo Vastu: ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ.. కీర్తించే వారు ప్రతిచోటా కనిపిస్తుంటారు. ప్రతి ఇంట్లోని పూజా మందిరంలో హనుమాన్ ప్రతిమ కచ్చితంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. ఆ రోజున కొంతమంది భక్తులు ఉపవాసం కూడా ఉంటారు.
అదే రోజున కొందరు ఆలయానికి వెళ్తే.. మరికొందరు ఇంట్లోనే పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఇంట్లో పూజలు చేసే వారు తెలియకుండానే కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది. అది వారి కుటుంబంపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఆంజనేయ స్వామి పూజ, ప్రతిమ ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.
ఇలాంటి తప్పులు చేయకండి
ఇబ్బందులు తొలిగించేందుకు ఆంజనేయ స్వామిని హిందువులు పూజిస్తుంటారు. ఆయన్ని ఆరాధించడం వల్ల అనేక కష్టాలను తొలగిస్తారని వారి నమ్మకం. కానీ, హనుమాన్ కోసం ఇంట్లో చేసే పూజల్లో అనుకోని పొరపాట్లు దొర్లుతుంటాయి. అయితే సాధారణంగా ప్రతిరోజూ హనుమంతిని పూజించేందుకు ఆయన చిత్రపటాన్ని ఇంట్లోని పూజా మందిరంలో ప్రతిష్టిస్తారు.
ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యులపై ఉంటుందని వారి నమ్మకం. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం, హనుమాన్ ఫొటోను పూజా మందిరంలో ప్రతిష్టిచడంలో ఏమైనా తప్పులు జరిగే పెద్ద ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. దీని కారణంగా కుటుంబ సభ్యుల్లో మనశ్సాంతి లేకపోవడం డబ్బు నష్టం వంటి ప్రతికూలతలకు దారి తీయవచ్చు.
పూజా మందిరంలో ఇలాంటి చిత్రాలు పెట్టొద్దు
1) హనుమాన్ ఛాతీ చీలుస్తూ.. గుండెల్లో సీతారాముల ప్రతిమను చూపించే విధంగా ఉన్న ఫొటోను ఇంట్లో ఎప్పుడూ పెట్టకూడదు. అలాంటి చిత్రం ఇంటికి శుభప్రదం కాదు.
2) హనుమంతుడు తన భుజాలపై శ్రీరాముడు, లక్ష్మణుడు కూర్చున్న ఫోటోను ఇంట్లోని పూజా మందిరంలో పెట్టడం సరికాదు.
3) ఆంజనేయ స్వామి.. లంక దహన ఫోటో ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. పొరపాటున కూడా అలాంటి ఫోటోను ఇంట్లో పెట్టకండి.
4) పవన్‌పుత్ర రూపంలో హనుమంతుడు గాల్లో ఎగురుతూ ఉన్న ఫొటోను ఇంట్లో పెట్టకపోవడం మంచిది. ఈ ఫోటో కుటుంబ సభ్యుల జీవితంలో నిరంతరం హెచ్చు తగ్గుల వంటి ఇబ్బందులకు గురిచేస్తుంది.
ఇలాంటి ఫొటో పెట్టడం శుభపరిణామం
ఇంట్లోని పూజా మందిరంలో ఏదైనా దేవుడి చిత్రపటాన్ని పెట్టేటప్పుడు.. దేవతలు సున్నితమైన రూపంలో నవ్వుతున్న ముఖం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. హనుమాన్ జీ చిత్రాన్ని ఉంచేటప్పుడు కూడా ఆయన నవ్వుతున్నాడని గమనించండి. అలాంటి ఫొటోలు లేదా ప్రతిమలను పసుపు దుస్తులు ధరించి పూజా మందిరంలో ప్రతిష్ట చేయడం మంచిది.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారమంతా వాస్తు శాస్త్రం ఆధార పడి ఉంటుంది. ఈ సమాచారాన్ని ZEE తెలుగు NEWS ధ్రువీకరిచడం లేదు)
Also Read: Today Horoscope January 11 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook