Surya Dosham symptoms and remedies: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీ జాతకంలో గ్రహ దోషం ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. మీ జాతకంలో సూర్యభగవానుడు బలమైన స్థానంలో ఉంటే మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. సూర్య దోషం ఉన్న వ్యక్తులు వృత్తి, గౌరవం, ఆరోగ్యం మెుదలైన అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోంటారు.
సూర్య దోషం లక్షణాలు
** జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే.. పనిచేసే చోట ఎప్పుడూ అతనికి గౌరవం లభించదు. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా అతనికి విజయం దక్కదు. మీ పనిలో ఆటంకాలు ఏర్పడతాయి.
** సూర్యుని బలహీనత కారణంగా మీ అత్తమామల ఇంట్లో అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభించదు. మీ ప్రతిష్ట దిగజారుతుంది.
** జాతకంలో సూర్య దోషం ఉన్న వ్యక్తికి అనేక అనారోగ్య సమస్యలు చుట్టిముడతాయి.
సూర్య దోష పరిహారాలు
** సూర్య దోషాన్ని తొలగించడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని ప్రభావవంతమైన నివారణలు చెప్పబడ్డాయి. ఈ పరిహారం సూర్య దోషం యొక్క అశుభ ప్రభావాలను తొలగిస్తుంది మరియు సూర్యుడిని బలపరుస్తుంది. అంతేకాకుండా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.
** ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత నీటితో సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. దీంతో మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. కుటుంబ మద్దతు లభిస్తుంది.
** ప్రతి ఆదివారం వీలైతే ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్ట్రోత్రం పఠించండి. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో మీరు విజయం పొందుతారు.
** ఆదివారం పేదవాడికి నల్ల దుప్పటి దానం చేయండి. దీని వల్ల రాహు-కేతువులపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది.
** రాగి పాత్రతో నీటితో తీసుకుని శివలింగంపై అభిషేకం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా నల్ల నువ్వులను దానం చేయండి.
**చేపలకు పిండి మాత్రలు, పక్షులకు ఆహారం తినిపించడం వల్ల మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి
Also Read: Shukra Gochar 2023: మేషరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook