Shattila Ekadashi 2024 date: షట్టిల ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు నువ్వులను ఎందుకు దానం చేస్తారు?

Shattila Ekadashi 2024: మాఘమాసంలోని కృష్ణ పక్షంలోని వచ్చే ఏకాదశినే షట్టిల ఏకాదశి అంటారు. ఇది ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది, దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 03:24 PM IST
Shattila Ekadashi 2024 date: షట్టిల ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు నువ్వులను ఎందుకు దానం చేస్తారు?

Shattila Ekadashi 2024 date and Importance: హిందూ మతంలో ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఈరోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. మాఘమాసంలోని కృష్ణ పక్షంలోని వచ్చే ఏకాదశినే షట్టిల ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. షట్టిల ఏకాదశి నాడు నువ్వులను శ్రీమహావిష్ణువుకు నైవేధ్యంగా పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

షట్టిల ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది షట్టిల ఏకాదశి తిథి జనవరి 5వ తేదీ సాయంత్రం 5.24 గంటలకు ప్రారంభమై జనవరి 6వ తేదీ సాయంత్రం 4.07 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, షట్టిల ఏకాదశి మంగళవారం, ఫిబ్రవరి 6న జరుపుకుంటారు. షట్టిల ఏకాదశి పారణ సమయం ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 7.06 నుండి 9.18 వరకు ఉంటుంది.

షట్టిల ఏకాదశి పూజా విధానం
షట్టిల ఏకాదశి నాడు ఉదయాన్నే నువ్వులను నీటిలో వేసి స్నానం చేయండి. ఆ తర్వాత ఉపవాసం ఉంటూ విష్ణునామస్మరణ చేయండి. అనంతరం మంచి ముహూర్తంలో శ్రీహరిని పూజించండి. దీప ధూప నైవేద్యాలను సమర్పించండి. ఆరాధన పూర్తయిన తర్వాత నువ్వులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున నువ్వులతో చేసిన వాటిని తినడం వల్ల మీకు మేలు జరుగుతుంది. . ఇలా చేయడం వల్ల విష్ణువు ప్రసన్నుడై మీ ప్రతి కోరికను తీరుస్తాడు. 

Also Read: Astology: మరో నెల రోజుల్లో కీలక గ్రహ మార్పు.. ఈ రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..

Also Read: Shani Surya yuti 2024: 30 ఏళ్ల తర్వాత శని-సూర్యుల కలయిక.. ఫిబ్రవరిలో ఈ 4 రాశులకు కష్టాలే ఇక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News