Sourav Ganguly about virat Kohli 100th Test match: శుక్రవారం (మార్చి 4) నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్ట్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్. దాంతో టీమిండియా తరపున టెస్టుల్లో వందో టెస్టు ఆడనున్న 12వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. కోహ్లీ కెరీర్‌లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కోహ్లీ వందో టెస్ట్‌లో వంద కొట్టాలని కోరుకున్నారు. భారత క్రికెట్‌కు ఇది గొప్ప క్షణం అని దాదా పేర్కొన్నారు.
తాజాగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'ఏ క్రికెటర్ కెరీర్‌లో అయినా ఇదొక గొప్ప మైలురాయి. దేశం తరఫున ఆడటం మొదలుపెట్టినప్పుడు వంద టెస్టు మ్యాచ్‌లు ఆడాలనేది ఓ కల. విరాట్ కోహ్లీకి మాత్రమే కాకుండా భారత క్రికెట్‌కు ఇది గొప్ప క్షణం. నేను వ్యక్తిగతంగా ఈ అనుభూతిని ఎదుర్కొన్నా. ఇది ఏ క్రికెటర్‌కైనా వ్యక్తిగతంగా ఎంత ముఖ్యమైందో గ్రహించాను. విరాట్‌ది గొప్ప ప్రయాణం. 10-11 సంవత్సరాల క్రితం కెరీర్ ప్రారంభించి.. ఈ రోజు ఉన్నత స్థానాలకు చేరుకున్నాడు. ఇది గొప్ప విజయం' అని అన్నారు.
'బీసీసీఐ అధ్యక్షుడిగా, భారత మాజీ సారథిగా, టీమిండియా తరఫున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కోహ్లీ అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడు. గొప్ప మైలురాళ్లను సాధించడానికి అతనికి ఇంకా కొంత సమయం మిగిలి ఉంది. కోహ్లీ ఇదే ఆటను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నాను. కోహ్లీకి, అతని కుటుంబానికి, అతని కోచ్‌కి మరియు విరాట్ క్రికెట్ కెరీర్‌లో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికి అభినందనలు' అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. కోహ్లీ వందో టెస్ట్‌లో వంద కొట్టాలని, మ్యాచ్ చూసేందుకు నేను కూడా వెళుతున్నా అని దాదా చెప్పారు.
విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మక వందో టెస్ట్‌లో సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే గత రెండున్నరేళ్లుగా విరాట్ అంత ఫామ్‌లో లేకపోవడం కాస్త కలవరపెట్టే అంశం. ఇటీవల ముగిసిన టీ20లో పరుగులు చేయడం సంతోషించాల్సిన విషయం. ప్రస్తుతం కోహ్లీ 99 టెస్టుల్లో 7962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 నాటౌట్. టెస్టుల్లో విరాట్ స్ట్రైక్ రేట్ 55.7గా ఉండగా.. యావరేజ్ 50.4గా ఉంది.
Also Read: IPL 2022: అభిమానులకు గుడ్ న్యూస్.. నేరుగా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు! కానీ ఓ కండిషన్!!
Also Read: AP Rain Forecast: ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook