Five Indian Cricketers celebrate their birthday on december 6: ఒకరోజు ఒకరిద్దరు క్రికెటర్లు పుట్టినరోజు జరుపుకోవడం సహజమే. కానీ ఒకేసారి ఆరుగురు క్రికెటర్లు పుట్టిన రోజులు జరుపుకోవడం మాత్రం చాలా అరుదు అని చెప్పాలి. అందులో ఐదుగురు క్రికెటర్లు మన దేశానికి చెందిన వారు కావడం విశేషం. నేడు (డిసెంబరు 6) భారత ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, కరుణ్ నాయర్, రుద్రప్రతాప్ సింగ్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. వీరితో పాటుగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నాడు. దాంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.
టీమిండియా పేస్ బౌలింగ్‌కు జస్ప్రీత్ బుమ్రా కీలకం. నేటితో బుమ్రా 29వ పడిలో అడుగుపెట్టాడు. 'భారత పేస్ డైమండ్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్‌లో ఇప్పటివరకు 162 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 319 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా బుమ్రా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఆసియా కప్ 2022, టీ20 ప్రపంచకప్ 2022లో ఆడలేదు.
ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా పేరు తెచ్చుకున్నాడు. జడ్డు నేటితో 34వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఆసియా కప్ మధ్యలో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన జడేజా టీ20 ప్రపంచకప్ 2022లో ఆడలేదు. కెరీర్‌లో ఇప్పటివరకు 295 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
టీమిండియా వన్డే జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్న ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. నాలుగో నెంబర్ స్థానంకు తాను సరిపోతానని నిరోపించుకున్న అయ్యర్ నేడు 28వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. న్యూజిల్యాండ్ పర్యటన అద్భుతంగా ఆడి మాజీల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటివరకు 91 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
భారత టెస్టు జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న బ్యాటర్ కరుణ్ నాయర్ నేడు 31 పడిలోకి అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఆడింది 8 మ్యాచులే అయినా.. మరపురాని ఇన్నింగ్స్ ఒకటి ఆడాడు. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడిన ఆర్పీ సింగ్ పుట్టినరోజు నేడు. కెరీర్‌లో 82 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్‌గా పనిచేసిన ఆండ్రూ ఫ్లింటాఫ్ నేడు పుట్టినరోజు జరుపుకొంటున్నాడు.
Also Read: King Cobra Monkey Viral Video: బ్లాక్ కింగ్ కోబ్రా తోకను లాగిన కోతి.. చివరికి ఏమైందంటే?
Also Read: Rahu Transit 2023: మీన రాశిలోకి రాహువు.. ఈ మూడు రాశుల వారు ఉన్నపళంగా ధనవంతులు అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.