Uppal Stadium: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత జట్టు ఓటమిలో ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. 28 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ 1-౦తో భారత్‌పై ఆధిక్యం సాధించింది. 230 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి దిగిన భారత్ 202 పరుగుల వద్ద ఆలౌటైంది. ఏడు వికెట్లతో ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ భారత్‌ను చావు దెబ్బతీశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే హార్ట్‌లీ రెచ్చిపోయాడు. అతడి బంతులను ఆడలేక మనోళ్లు వికెట్లు సమర్పించుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలచాడు.
చేధనకు దిగిన భారత్ బ్యాటింగ్‌లో తడబడింది. 119 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును భారత ఆటగాళ్లు గట్టెక్కించలేకపోయారు. రవిచంద్రన్ అశ్విన్, శ్రీఖర్ భరత్ నిలకడగా ఆడి విజయంపై ఆశలు రేపారు. కానీ హార్ట్‌లీ భరత్‌ను ఔట్ చేయడంతో 54 పరుగుల భాగస్వామ్యానికి విరామం పడింది. తర్వాత కొద్దిసేపటికే అశ్విన్ కూడా వచ్చేశాడు. హైదరాబాదీ మియా సిరాజ్, బుమ్రా కాసేపు మైదానంలో నిలబడినా విజయానికి కావాల్సిన పరుగులు రాబట్టలేకపోయారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 316/6తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆదివారం అదనంగా 104 పరుగులు జోడించింది. రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులు సాధించి ఇంగ్లీష్ జట్టు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 230 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 436 పరుగులు సాధించగా.. రవీంద్ర జడేజా (87), జైశ్వాల్ (80) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది.
హార్టిలే చావుదెబ్బ
లక్ష్యం పెద్దది కాకపోవడంతో భారత్ సునాయాసంగా చేధిస్తుందని అందరూ భావించారు. ఉప్పల్ స్టేడియంలో భారత్ విజయం సాధిస్తుందని హైదరాబాద్ క్రికెట్ ప్రియులు ఆశించారు. కానీ ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ భారత్‌ను చావుదెబ్బ తీశాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే తన బంతితో చెలరేగిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వికెట్లు తీసి భారత్‌ను ఓటమి బాట పట్టించాడు. 26 ఓవర్లు వేసి కేవలం 62 పరుగులు మాత్రమే ఇచ్చి హార్ట్‌లీ తిరుగులేదని నిరూపించాడు. ప్రత్యర్థి అయినా హార్ట్‌లీ ప్రదర్శనను మెచ్చుకోకుండా ఉండలేం.
Also Read: Sanjay Vs KTR: పాత సామానోళ్లు కూడా 'కారు'ను కొనరు: కేటీఆర్‌పై విరుచుకుపడ్డ బండి సంజయ్
Also Read: Bottole Thrash: 'బాటిల్' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook