2 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన దీపక్ ధపోలా !

చరిత్ర సృష్టించిన దీపక్ ధపోలా ! 

Last Updated : Nov 19, 2018, 10:09 AM IST
2 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన దీపక్ ధపోలా !

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఫాస్ట్ బౌలర్ దీపక్ ధపోలా 2 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. గత 9 ఏళ్ల పాటు ఢిల్లీకి ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్ ఈసారి ఉత్తరాఖండ్‌ తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. 21 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన దీపక్ ధపోలా.. ఈ ఘనత తనది కాదని, తనకు కోచింగ్ ఇచ్చిన కోచ్ రాజ్‌కుమార్ శర్మకే ఆ ఘనత దక్కుతుందని చెప్పి గురు భక్తి చాటుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి శిక్షణ ఇచ్చింది కూడా రాజ్‌కుమార్ శర్మనే కావడం విశేషం. 

ఈ సందర్భంగా ఢిల్లీ తరపున ఆడిన తొమ్మిదేళ్లు తాను అనుభవించిన మనోవేదనను గుర్తుచేసుకుని దీపక్ ధోపాలా ఆవేదన వ్యక్తం చేశాడు. 2016-17 రంజీ ట్రోఫిలో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. అలాగని తాను ఏనాడూ ప్రాక్టీస్‌ చేయడం మాత్రం ఆపలేదని తెలిపాడు. విరాట్ కోహ్లీ కూడా వచ్చి తమతో కలిసి ప్రాక్టీస్ చేసేవాడని, ప్రాక్టీస్ సెషన్స్‌లో తన బౌలింగ్ చూసి కోహ్లీ ఎంతో ముచ్చటపడేవాడని... ఏదేమైనా ప్రాక్టీస్ చేయడం మాత్రం మానొద్దు అని అప్పట్లో కోహ్లీ తనతో చెప్పేవాడని దీపక్ గుర్తుచేసుకున్నాడు.

Trending News