Harbhajan Singh React On Rift Rumours With MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ, భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు విభేదాలున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు యాజమాన్యం నుంచి ధోనీ వంటి ఆటగాళ్లకు దొరికినట్లుగా మద్దతు లభిస్తే.. మాజీ క్రికెటర్లలో చాలా మంది ఇంకొన్నేళ్లు ఆడేవారు అని హర్భజన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. నెట్టింట ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ధోనీ, మేనేజ్‌మెంట్‌పై భజ్జీ తన అక్కసు వెళ్లగక్కాడని అందరూ అనుకున్నారు. ధోనీ, భజ్జీ మధ్య విభేదాలు ఉన్నట్లు పలు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై తాజాగా హర్భజన్ సింగ్ స్పందించాడు. 'ఎంఎస్ ధోనీతో నాకేం సమస్య ఉంటుంది చెప్పండి. మేమిద్దరం ఎన్నో ఏళ్ల పాటు బి భారత జట్టుకు కలిసి ఆడాం. మేం మంచి స్నేహితులం. ఇప్పుడు మేమిద్దం మా వ్యక్తిగత జీవితాల్లో బిజీబిజీగా ఉన్నాం. అందుకే తరచుగా కలుసుకోలేకపోతున్నాం. అంతేగానీ మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. గొడవలు జరగడానికి మహీ నా ఆస్తులేం తీసుకోలేదు. అయితే నాకు ఆయన ఆస్తులపై చాలా ఆసక్తిగా ఉన్నా. ముఖ్యంగా ధోనీ ఫామ్‌హౌస్ అంటే నాకు చాలా ఇష్టం' అని భజ్జీ అన్నాడు.
2021 డిసెంబరులో హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ జట్లలో భజ్జీ సభ్యుడిగా ఉన్నాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోనే ఈ మెగా టోర్నీలు ఆడాడు. హర్భజన్ 31 టెస్టులు, 77 వన్డేలు, 25 టీ20 మ్యాచులు మహీ కెప్టెన్సీలోనే ఆడాడు. ఐపీఎల్‌లో ధోనీ సారథ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో హర్భజన్ కొన్నేళ్ల పాటు సభ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలో కూడా ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యమే ఉంది. ఇక ధోనీ, తన మధ్య విభేదాలు లేవని భజ్జీ స్పష్టం చేశాడు.
Also Read: Honda Activa 2023 Price: 18 వేలకే హోండా యాక్టివా.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే! పూర్తి వివరాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి