Hyderabad Metro Last Train Services: సెప్టెంబర్ 25, ఆదివారం నాడు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడవ టీ20 క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిపోయే క్రికెట్ ప్రియులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సమీపంలో ఉన్న స్టేడియం మెట్రో స్టేషన్ నుండి సెప్టెంబర్ 25న రాత్రి 11 గంటల నుండి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రకటించారు. చివరి రైలు సెప్టెంబర్ 26న.. అంటే మ్యాచ్ ముగిసిన అనంతరం అర్ధరాత్రి దాటాకా రాత్రి 1 గంట వరకు అమీర్‌పేట్, జేబీఎస్ పరేడ్‌గ్రౌండ్స్ నుండి కనెక్టింగ్ రైళ్లు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు.
క్రికెట్ ప్రియులకు మరో ముఖ్యమైన గమనిక:
ఆరోజు మెట్రో రైలు సేవలు ఉపయోగించుకునే క్రికెట్ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో ఉప్పల్, స్టేడియం, NGRI మెట్రో స్టేషన్లలో మాత్రమే మెట్రో స్టేషన్ ఎంట్రీ గేట్స్ తెరిచి ఉంటాయి. మిగతా అన్ని ఇతర స్టేషన్లలో దిగిపోయే ప్రయాణికుల కోసం ఎగ్జిట్ గేట్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి కానీ ఆయా స్టేషన్ల నుంచి మెట్రో రైలు ఎక్కే అవకాశం ఉండదు.
ముందే రిటర్న్ టికెట్స్ లేదా స్మార్ట్ కార్డు ఉంటే మరీ మంచిది
మ్యాచ్‌కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుండి ఎగ్జిట్ అయ్యే వారు ముందుగానే రిటర్న్ టికెట్స్ కూడా తీసుకోవాల్సిందిగా సూచిస్తాం. లేదంటే ప్రయాణ సౌలభ్యం కోసం, క్యూలో నిలబడకుండా ఉండటానికి స్మార్ట్ కార్డ్‌లను ఉపయోగించాల్సిందిగా కస్టమర్‌లకు విజ్ఞప్తి చేయనున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు. సాధారణంగా అయితే.. రాత్రి 10:15 తర్వాత డిజిటల్ టిక్కెట్లు విక్రయించడానికి వీల్లేదనే విషయాన్ని కూడా ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
Also Read : IND vs AUS 3rd T20I: ఉప్పల్ మ్యాచ్‌పై నీలినీడలు.. మరో చోటుకు షిఫ్ట్ చేసే ఆలోచనలో బీసీసీఐ!
Also Read : IND vs AUS 3rd T20I Tickets: మా పాపకు విరాట్ కోహ్లీ అంటే పిచ్చి.. ఉదయం 5 గంటలకు వచ్చాం! ఇప్పుడు ఐసీయూలో ఉంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి