ICC Fined India: శుభమన్ గిల్‌పై ఐసీసీ చర్యలు, మ్యాచ్ ఫీజు పెనాల్టీతో పాటు విచారణ, టీమ్ ఇండియాకు భారీ జరిమానా

ICC Fined India: గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర బ్యాటర్, టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్‌పై పెనాల్టీ పడింది. అదే సమయంలో విచారణ కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. అసలేం జరిగింది, శుభమన్ గిల్‌పై పెనాల్టీ ఎందుకనే వివరాలు పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 12, 2023, 07:10 PM IST
ICC Fined India: శుభమన్ గిల్‌పై ఐసీసీ చర్యలు, మ్యాచ్ ఫీజు పెనాల్టీతో పాటు విచారణ, టీమ్ ఇండియాకు భారీ జరిమానా

ICC Fined India: లండన్‌లోని ఓవల్ స్డేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌పై ఐసీసీ జరిమానా విధించింది. ముఖ్యంగా టీమ్ ఇండియా ఓపెనర్ శుభమన్ గిల్‌పై ఐసీసీ కఠినంగానే వ్యవహరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య లండన్ ఓవల్ స్డేడియంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో గ్రీన్ కామెరూన్ క్యాచ్ కారణంగా శుభమన్ గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ క్యాచ్ వివాదాస్పదంగా మారింది. రీప్లేలో అవుట్ కాదని స్పష్టంగా తేలింది. అయితే ఈ క్యాచ్‌ను అవుట్‌గా ప్రకటించిన అంపైర్ రిచర్డ్ కెటిల్ బ్రో నిర్ణయాన్ని శుభమన్ గిల్ బహిరంగంగా వ్యతిరేకించడమే కాకుండా ట్వీట్ చేశాడు. దాంతో ఐసీసీ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించింది. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించడమే కాకుండా అసంబద్ధంగా కామెంట్ చేయడంపై ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.7 ప్రకారం ఉల్లంఘనగా ఐసీసీ పరిగణించింది. విచారణ ఎదుర్కోవల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అంతటితో ఆగకుండా శుభమన్ గిల్ మ్యాచ్ ఫీజుపై 15 శాతం పెనాల్టీ విధించింది. 

టెస్ట్ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుబట్టడం, కామెంట్ చేయడంపై ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.7 ఉల్లంఘన కిందకు పరిగణిస్తూ టీమ్ ఇండియా బ్యాటర్ శుభమన్ గిల్ విచారణ ఎదుర్కోవడమే కాకుండా మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించామని ఐసీసీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. టీవీ అంపైర్ రిచర్డ్ కెటిల్ బ్రో తీసుకున్న నిర్ణయంపై శుభమన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా బహిరంగంగా విమర్శలు చేశాడు.

ఇక ఆ తరువాత ఆస్ట్రేలియా, టీమ్ ఇండియాలపై కూడా ఐసీసీ భారీ పెనాల్టీ విధించింది. స్లో ఓవర్ రన్‌రేట్ కారణంగా ఐసీసీ రెండు జట్లపై జరిమానా వేసింది. స్లో ఓవర్ రన్‌రేట్ కారణంగా టీమ్ ఇండియా మొత్తం మ్యాచ్ ఫీజును కోల్పోనుంటే..ఆస్ట్రేలియాపై 80 శాతం మ్యాచ్ ఫీజు చెల్లించేట్టు పెనాల్టీ విధించింది. 

ఐసీసీ ప్రవర్తనా నియమావలి ఆర్టికల్ 2.7 ప్రకారం శుభమన్ గిల్ కెరీర్‌కు 1 డీ మెరిట్ పాయింట్ యాడ్ అవుతుంది. ఇది కాకుండా మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా, ఐసీసీ విచారణ ఎదుర్కోవడం ఉన్నాయి. ఇక స్లో ఓవర్ రన్‌రేట్ కారణంగా టీమ్ ఇండియా 100 శాతం మ్యాచ్ ఫీజును, ఆస్ట్రేలియా 80 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా చెల్లించాల్సి ఉంది. 

Also read: Gautam Gambhir: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో విభేదాలపై ఎట్టకేలకు పెదవి విప్పిన గౌతం గంభీర్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News