ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్టు ర్యాకింగ్స్ ను ప్రకటించింది. తాజా ర్యాకింగ్ లో కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానం (893) లో నిలిచాడు. శ్రీలంక తో జరిగిన మూడో టెస్టుకు ముందు ఐదోస్థానంలో ఉన్న కోహ్లీ..తొలి ఇన్నింగ్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్ లో అర్థ సెంచరీ సాధించడంతో ఇది సాధ్యపడింది. ప్రస్తుతం 938 పాయింట్లతో ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా మన పుజరా రెండు స్థానాలు దిగజారి రెండో నాల్గో స్థానంలో నిలిచాడు. భారత అటగాళ్లు మురళీ విజయ్ 25 స్థానంలోనూ..రోహిత్ 40వ స్థానంలో కొనసాగుతున్నారు.
బౌలర్ల జాబితాలో అగ్రస్థానికి మళ్లీ చేరకుంటారని భావించిన జడేజా అందుకు భిన్నంగా ఒక స్థానం దిగజారి మూడో స్థానం (870) తో సరిపెట్టుకున్నాడు. మరో స్పిన్ దిగ్గజం అశ్విన్ నాల్గో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ కు చెందిన జేమ్స్ అండ్రుసన్ 894 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబడ 876 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఆలౌరౌండర్ల జాబితాలో జడేజా ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం జడ్డూ 414 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అగ్రస్థానంలో బంగ్లాకు చెందిన షకీబుల్ హాసన్ (437) ఉండగా.. అశ్విన్ 368 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు.
టీమిండియా అగ్రస్థానం పదిలం
జట్టు ర్యాంకింగ్ విషయానికి వస్తే శ్రీలంక సిరీస్ లో 1-0 సిరీస్ సొంతం చేసుకున్న భారత్ (124 పాయింట్లు) ఒక పాయింట్ కోల్పోయినప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా (111 పాయింట్లు) రెండో స్థానం, ఇంగ్లండ్ (105 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాయి. కాగా చెరో 97 పాయింట్లతో కివీస్, ఆసీస్ నాల్లో న్థానంలో కొనసాగుతున్నాయి. మన దాయాది దేశం పాకిస్తాన్ 88 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది.