Ind vs Nz Semifinal: ప్రపంచకప్ 2023 వరకూ టీమ్ సాగించిన జైత్రయాత్ర సాధారణమైంది కాదు. లీగ్ దశలో క్లీన్ స్వీప్ చేసిన ఇండియా సెమీపైనల్స్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అదే ఇప్పడు ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే న్యూజిలాండ్ టీమ్ ఇండియాకు ప్రమాదకరమే కావచ్చు.
ఐసీసీ ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్స్ రేపు ముంబై వాంఖడే స్డేడియంలో జరగనుంది. టీమ్ ఇండియా ఈప్రపంచకప్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌లు ఆడి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. టీమ్ ఇండియా జైత్రయాత్ర చూస్తే సెమీస్ విజయం ఖాయమనే అనుకుంటారు. కానీ ప్రత్యర్ధి న్యూజిలాండ్ కావడం వల్ల ఆందోళన కలుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రపంచకప్ లీగ్ దశలో కివీస్‌పై ఇండియా 4 వికెట్ల తేడాతో సాధించిన విజయం సాధారణమైంది కాదు. 20 ఏళ్ల తరువాత ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్‌పై ఇండియాకు ఇదే విజయం.
లీగ్ దశలో ఇండియా ఆడిన 9 మ్యాచ్‌లు గెలిచింది. ఇప్పుడు సెమీస్ పోరులో న్యూజిలాండ్‌పై విజయం పెద్ద కష్టమేం కాదన్పిస్తోంది. కానీ ఐసీసీ టోర్నీల్లో మాత్రం న్యూజిలాండే విజయం సాధిస్తోంది. 2003 తరువాత న్యూజిలాండ్ వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో కూడా ఇండియాపై విజయం నమోదు చేసింది.
2007లో టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచినా, లీగ్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. 2016 టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఇండియా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయింది. తిరిగి 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఓడిపోయింది. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఇండియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక 2021 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ మరోసారి ఇండియాపై గెలిచింది.
అందుకే సెమీస్ పోరులో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా పోరు కాస్త ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ పోరు అంత సులభం కాకపోవచ్చన్పిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఇండియా కచ్చితంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నా ఎక్కడో ఏదో టెన్షన్ మాత్రం వీడటం లేదు.
టీమ్ ఇండియా
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
న్యూజిలాండ్
కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూన్సన్, మౌంట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోథి, విల్ సౌత్ యంగ్
Also read: Ind vs Nz Match Tickets: బ్లాక్ మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న ఇండియా-కివీస్ సెమీస్ మ్యాచ్ టికెట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook