World Cup 2023: ప్రపంచకప్ 2023లో నాకౌట్ దశ సమీపిస్తోంది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్ స్థానం ఖాయం చేసుకోగా మూడు, నాలుగు స్థానాలు ఇంకా నిర్ధారణ కావల్సి ఉంది. మూడవ స్థానంలో నిలిచేది ఆస్ట్రేలియా అని దాదాపుగా తేలిపోనుంది. మరి నాలుగవ జట్టు విషయంలోనే సందిగ్దత వెంటాడుతోంది. ఎందుకంటే ఆ స్థానం కోసం ఏకంగా మూడు జట్లు పోటీ పడుతున్నాయి.
ఐసీసీ ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో ఇండియా, దక్షిణాఫ్రికా దేశాలు మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లకు మరో మ్యాచ్ మిగిలింది. ఇప్పటికే ఇండియా 16 పాయింట్లతో, దక్షిణాఫ్రికా 12 పాయింట్లతో సెమీస్ స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. ఇక మూడవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటికే 10 పాయింట్లు తెచ్చుకుంది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. నవంబర్ 7వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌తో, నవంబర్ 11 న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండూ గెలిస్తే 14 పాయింట్లతో, ఒకటి గెలిచినా 12 పాయింట్లతో మూడవ సెమీస్ స్థానానికి దాదాపుగా చేరుకున్నట్టే.
ఇక మిగిలింది నాలుగవ సెమీస్ స్థానం. ఈ స్థానం కోసం ఏకంగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పాకిస్తాన్ దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ మూడింటిలో ఆఫ్ఘనిస్తాన్‌కు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడి 4 గెలిచి 8 పాయింట్లు తెచ్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఆస్టేలియా, దక్షిణాఫ్రికాలతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండూ గెలిస్తే 12 పాయింట్లతో నేరుగా 4వ సెమీస్ స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్, పాకిస్తాన్‌లకు ఇంకా ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే మిగిలుంది. ఒకవేళ ఒకటి గెలిచి మరొకటి ఓడితే 10 పాయింట్లు తెచ్చుకుని కూడా పోటీలో ఉంటుంది. అదే జరిగితే పాకిస్తాన్, న్యూజిలాండ్ దేశాలు మిుగిలిన రెండు మ్యాచ్‌లు ఓడితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరగలదు.
ఇక పాకిస్తాన్‌కు ఇంకా ఒకే ఒక మ్యాచ్ మిగిలింది. ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న ఆ జట్టు 5వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే మిగిలిన మ్యాచ్ ఇంగ్లండ్‌పై తాను గెలవడమే కాకుండా న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల ఓటమిని కోరుకోవల్సి ఉంటుంది. అంటే పాకిస్తాన్ జట్టు సెమీస్ చేరడం అనేది ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది.
ఇక న్యూజిలాండ్ కూడా 8 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. ఇంకా ఒకే ఒక మ్యాచ్ శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంకపై గెలవడం ద్వారా 10 పాయింట్లు తెచ్చుకుని సెమీస్‌కు చేరేందుకు పాకిస్తాన్‌తో పోలిస్తే ఎక్కువ అర్హత సాధిస్తుంది. ఎందుకంటే రన్‌రేట్ పాకిస్తాన్‌తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం న్యూజిలాండ్‌కు చాలా అవసరం. లేకపోతే ఆ అవకాశం కోల్పోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook