India Playing 11 vs Sri Lanka 2nd Test: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. స్వదేశంలో వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. శ్రీలంకను కూడా ఒక్క మ్యాచ్ గెలవకుండా ఇంటికి పంపాలని చూస్తోంది. మొహాలీ వేదికగా జరిగిన మొదటి టెస్ట్‌లో భారీ విజయాన్ని అందుకున్న భారత్.. ఇప్పుడు అదే జోరులో బెంగళూరు వేదికగా జరిగే పింక్ బాల్ (డే/నైట్) టెస్టుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈరోజు (మార్చి) నుంచి భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ నేపథ్యంలో తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
మొదటి మ్యాచులో టాపార్డర్, మిడిలార్డర్ రాణించడంతో ఈ మ్యాచులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. దాంతో రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న శుభ్‌మన్ గిల్‌కు నిరాశే మిగలనుంది. మూడో స్థానంలో హనుమ విహారి, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. ఆపై శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే స్థానాల్లో శ్రేయస్, విహారిలకు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. విహారీ హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. శ్రేయస్ మాత్రం విఫలమయ్యాడు. అయితే అతనికి మరో అవకాశం మేనేజ్‌మెంట్ ఇవ్వనుంది.
వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. మొదటి టెస్టు మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన పంత్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో వస్తాడు. మొదటి టెస్ట్‌లో భారీ అజేయ శతకంతో చెలరేగిన జడ్డు.. ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే జడేజాకు ఫిట్‌నెస్ సమస్య ఉందని తెలుస్తోంది. అతడు ఆడడం డౌటే అట. ఎనిమిదో స్థానంలో ఆర్ అశ్విన్ బరిలోకి దిగుతాడు.
మొదటి మ్యాచులో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగింది. భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రెండో మ్యాచ్ ఫ్లడ్ లైట్స్ కింద జరగుతుంది కాబట్టి ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే జయంత్ యాదవ్ స్థానంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు. పింక్ బాల్‌తో మ్యాచ్ కాబట్టి అదనపు బ్యాటర్ అవసరం అనుకుంటే మాత్రం అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు బరిలోకి దిగనున్నారు.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ.
Also Read: Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే!!
Also Read: Horoscope Today March 12 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్త అందుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook