IND vs AUS 1st ODI Highlights: ఆస్ట్రేలియాపై ఘన విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. బౌలింగ్‌లో మహ్మద్ షమీ మెరుపులు.. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌ల అర్ధ సెంచరీలతో ఈజీగా కంగారూ జట్టును చిత్తు చేసింది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టగా.. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ 74 రన్స్, రుతురాజ్ గైక్వాడ్ 71 పరుగులతో మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు, కేఎల్ రాహుల్ 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు.
ఇక ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చేసిన తప్పిదం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ కెమెరూన్ గ్రీన్‌కు శాపంగా మారింది. మహమ్మద్ షమీ వేసిన బంతిని వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మిస్ చేశాడు. ఆ తర్వాత బంతి వికెట్‌కీపర్ వెనుకకు వెళ్లింది. ఇంతలో బ్యాట్స్‌మెన్ రన్స్ కోసం పరిగెత్తారు. మొదటి రన్ పరుగు పూర్తి చేసి.. రెండో రన్ కోసం.. ఇద్దరు బ్యాట్స్‌మెన్ దాదాపు ఒకేసారి క్రీజ్‌ను వదిలిపెట్టారు. అయితే కెమెరూన్ గ్రీన్ బౌలర్ ఎండ్ నుంచి చాలా ముందుకు వెళ్లగా.. రుతురాజ్ గైక్వాడ్ వేసిన త్రోను సూర్యకుమార్ యాదవ్ చక్కగా అందుకుని వికెట్లను పడగొట్టాడు. దీంతో అనూహ్య రీతిలో గ్రీన్ (31) పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
Green light?🚦 Not when #SuryakumarYadav is around 🛑#INDvAUS in 4K on #JioCinema in 11 languages & LIVE-
English: #Sports18
Hindi: #ColorsCineplexSuperhits
Tamil: #ColorsTamil
Kannada: #ColorsKannadaCinema
Bengali: #ColorsBanglaCinema#IDFCFirstBankODITrophy #TestedByTheBest pic.twitter.com/I4fPhWdfBp— JioCinema (@JioCinema) September 22, 2023
అంతకుముందు లబూషేన్ వికెట్ కూడా ఊహించని రీతిలో ఔట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో లబూషేన్ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి మిస్ అయింది. అయితే కీపర్ కేఎల్ రాహుల్‌ను బంతిని అందుకోలేకపోయాడు. విచిత్రంగా కేఎల్ రాహుల్ ప్యాడ్స్‌కు బంతి తాకి.. వెనక్కి వచ్చి బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో స్టంప్ అవుట్ కోసం అప్పీల్ చేయగా.. రీప్లైలో లబూషేన్ అవుట్‌గా తేలింది. ఇలా కేఎల్ రాహుల్ చెత్త ఫీల్డింగ్ చేసినా.. టీమిండియాకు రెండు వికెట్లు దక్కాయని అభిమానులు అనుకుంటున్నారు.
How close was that? 😵💫
Enjoy #INDvAUS in 4K on #JioCinema in 11 languages & LIVE:
English on #Sports18
Hindi on #ColorsCineplexSuperhits
Tamil on #ColorsTamil
Kannada on #ColorsKannadaCinema
Bengali on #ColorsBanglaCinema#IDFCFirstBankODITrophy #TestedByTheBest pic.twitter.com/CoXRpx0HnO— JioCinema (@JioCinema) September 22, 2023
ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (41), లబూషేన్ (39), జోష్ ఇంగ్లిస్ (45) రాణించారు. ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా, రవి అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ వన్డేల్లో కూడా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇప్పటికే టెస్టులు, టీ20ల్లో నెంబర్ వన్ జట్టుగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి