IND Vs AUS Warm-Up Match highlights: దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో (T20 Warm-Up Match Today) టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియన్ టీమ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ నష్టపోయి ఛేధించింది. ఈ మ్యాచ్‌లో(IND Vs AUS Match Today) ప్రత్యర్థి ఆస్ట్రేలియా నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో టీమిండియా పూర్తి చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (39 పరుగులు), రోహిత్ శర్మ టీమిండియాకు అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు. రోహిత్ శర్మ (60) హాఫ్ సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ బరిలో దిగిన హార్దిక్ పాండ్యా (14)తో కలిసి సూర్య కుమార్ యాదవ్(38) (Surya Kumar Yadav) మ్యాచ్‌ను పూర్తి చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు (IND Vs AUS Warm-up Match).. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు నమోదు చేసింది. ఆరంభంలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (3), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (8) తక్కువ పరుగులకే అవుట్ అవ్వగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ మార్ష్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ (37) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. అంతలోనే మ్యాక్స్‌వెల్ అవుట్ అయిన తర్వాత.. క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టొయినిస్ (41)తో (Marcus Stoinis) కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ కొనసాగించాడు.
భువనేశ్వర్ కుమార్ వేసిన చివరి ఓవర్లో స్టీవ్ స్మిత్ రోహిత్ శర్మకు (Rohit Sharma) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్స్ దూకుడుగా ఆడటంతో ఆ జట్టు ఓ మోస్తరు పరుగులు చేయగలిగింది.
Also read : Cricket and Duckout: క్రికెట్ చరిత్రలో డకౌట్ కాని క్రికెటర్లు ఎవరో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook