India Vs England 5th T20 Highlights: బ్యాటర్ల విశ్వరూపం.. బౌలర్ల అద్భుత ప్రదర్శన.. కళ్లు చెదిరే ఫీల్డింగ్.. వెరసి ఐదో టీ20లో భారత్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు చిత్తయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (135) శతకంతో చెలరేగగా.. శివమ్ దూబే (30) రాణించాడు. అనంతరం ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు కేవలం 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా 4-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మ్యాన్ ద మ్యాచ్ అవార్డు అభిషేక్ శర్మకు దక్కగా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌కు వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యాడు.
భారత్ విధించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. జాకబ్ బెతల్ (10) రెండెంకెల స్కోరు చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బౌలర్ల దెబ్బకు 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఇంగ్లాండ్ చేతులేత్తిసింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ తలో 2, బిష్ణోయ్ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు భారత్.. ఇంగ్లిష్ బౌలర్లను చితక్కొట్టింది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ (54 బంతుల్లో 135, 7 ఫోర్లు, 13 సిక్సర్లు) ఊచకోత కోశాడు. సిక్సర్ల మోతతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 37 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. టీమిండియా తరుఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. టీ20 కెరీర్‌లో అతడికి ఇది రెండో శతకం. అభిషేక్ శర్మకు తోడు శివమ్ దూబే (13 బంతుల్లో 30, ౩ ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (15 బంతుల్లో 24, 3 ఫోర్లు, ఒక సిక్స్) బ్యాట్ ఝులిపించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (16), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (2), హార్థిక్ పాండ్యా (9), రింకూ సింగ్ (9) నిరాశపరిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 3 వికెట్లు తీయగా.. వుడ్ 2 రెండు వికెట్లు పడగొట్టాడు., ఆర్చర్, రషీద్, ఒవర్టన్‌కు చెరో వికెట్ దక్కింది.
Also Read: Tirumala Ratha Saptami: రథ సప్తమి పర్వదినం సందర్బంగా తిరుమలలో ఏడు వాహనాలపై ఊరేగనున్న మలయప్ప స్వామి..
Also Read: Telangana BC Survey: ఇవాళే కులగణన నివేదిక.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.