Team India Semi Finals Records: ప్రపంచ కప్ 2023లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. అజేయంగా సెమీస్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌లో తలపడనుంది. రేపు మధ్యాహ్నం ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంటుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆటగాళ్లు అందరూ ఫామ్‌లో ఉండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్ 8 సార్లు సెమీస్‌కు చేరుకుంది. అయితే వీటిలో విజయాల కంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. టీమిండియా సెమీస్ రికార్డు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
1983 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్‌పై ఘన విజయంతో ఫైనల్‌లో ఎంట్రీ ఇచ్చింది కపిల్ దేవ్ సేన. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి.. తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. 1987లో ఉపఖండం వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో ప్రత్యర్థిగా ఇంగ్లాండ్ ఎదురైంది. 1983 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. 50 ఓవర్ల మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేయగా.. భారత్ 219 పరుగులకే ఆలౌటైంది.
1996లో టీమిండియా మరోసారి సెమీస్‌కు చేరింది. అయితే మ్యాచ్‌లో మధ్యలో అభిమానులు స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, ఇతర వస్తువులను విసిరారు. దీంతో మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది. అంపైర్లు, మ్యాచ్ రిఫరీ.. నిబంధనల ప్రకారం రన్ రేట్‌లో ముందున్న శ్రీలంకను విజేతగా ప్రకటించారు. 2003లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. సెమీ ఫైనల్‌లో కెన్యాతో తలపడింది. గంగూలీ సెంచరీ, సచిన్ హాఫ్ సెంచరీతో కెన్యాకు 270 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం కెన్యా 179 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో భారత అభిమానుల కల చెదిరిపోయింది.
2011 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన భారత్.. కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలోని జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. సెమీస్‌లో దయాది పాకిస్థాన్‌తో తలపడింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ సమయోచిత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేయగా.. ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్ 231 పరుగులకే ఆలౌటైంది. ఫైనల్‌లో శ్రీలంకపై విజయంతో రెండోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. 2015 ప్రపంచకప్ సెమీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా స్టీవెన్ స్మిత్ సెంచరీ, ఫించ్ హాఫ్ సెంచరీతో 7 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం టీమిండియా 233 పరుగులకు ఆలౌట్ అయింది.
2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌ను క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మార్చిపోరు. ఈ వరల్డ్ కప్‌లో మాదిరే అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి టాపర్‌గా సెమీస్‌లోకి చేరుకుంది. అప్పుడు కూడా ప్రత్యర్థి న్యూజిలాండ్ టీమ్. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ రెండురోజుల పాటు సాగింది. చివరకు కివీస్ విజయం సాధించి ఫైనల్‌కు వెళ్లింది. ఇప్పటివరకు మొత్తం నాలుగు సెమీ ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయింది. చరిత్ర ఎలా ఉన్నా.. ఈసారి అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రపంచకప్ సెమీస్ చేరింది. 2019 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈసారి భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. సొంతగడ్డపై మరోసారి విశ్వ విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టీమిండియా.
Also Read: 7th Pay Commission: దీపావళికి రాష్ట్ర ప్రభుత్వాలు గిఫ్ట్.. ఏ రాష్ట్రం ఎంత జీతం పెంచిందంటే..?
Also Read: Diabetes Control Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ మెంతి నీళ్లు ఎందుకు తాగాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి