Suresh Raina feels Team India will win T20 World Cup 2022 if beat Pakistan: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టీ20 ప్రపంచకప్ 2022 ఆదివారం మొదలైంది. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అసలు సమరం 'సూపర్ 12' మ్యాచులు అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అవుతాయి. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఢీ కొట్టనున్నాయి. అక్టోబర్ 23న దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌పై మాజీలు అందరూ తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా స్పందించాడు.
ఒత్తిడితో కూడుకున్న టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధిస్తే.. రోహిత్ సేన ట్రోఫీ సునాయాసంగా గెలుచుకుంటుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ మీడియాతో మిస్టర్ ఐపీఎల్ రైనా మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్‌తో ప్రారంభ మ్యాచ్‌లో గెలిస్తే.. భారత్ ప్రపంచకప్‌ను గెలుస్తుంది. టీమిండియా పటిష్టంగా ఉంది. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. భారత్ ట్రోఫీ గెలుస్తుంది' అని అన్నాడు.
'మెగా టోర్నీకి దూరమయిన రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు ప్రత్యామ్నాయాన్ని తీసుకురాలేం. అయితే మొహ్మద్ షమీ ఎంపిక సరైన నిర్ణయం. సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి వారు జట్టులో ఉన్నారు. విరాట్ కోహ్లీ రాణిస్తున్నాడు. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్. ఈ నేపథ్యంలో పాక్‌తో తొలి మ్యాచ్ గెలవగలిగితే.. అది జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. నాతో సహా దేశమంతా భారత్ గెలుపును కోరుకుంటున్నారు' అని సురేశ్ రైనా చెప్పాడు.
'రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఇద్దరూ జట్టుకు కీలకమే. డీకే ఇటీవల మ్యాచుల్లో గొప్పగా ఆడాడు. ఫినిషర్ పాత్ర పోషించాడు. పంత్ లాంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ జట్టుకు అవసరమే. టీ20 ప్రపంచకప్ 2007లో గౌతమ్ గంభీర్, వన్డే ప్రపంచకప్ 2011లో యువరాజ్ సింగ్ జట్టుకు ఎలా ఉపయోగపడ్డారో మనం చూశాం' అని మిస్టర్ ఐపీఎల్ చెప్పుకొచ్చాడు.
Also Read: నేహా మాలిక్ గ్లామర్ ట్రీట్.. సాగరతీరాన బికినీ అందాలతో కనువిందు చేస్తున్న హాట్ బ్యూటీ!
Also Read: దురద పెడుతుంటే.. 15 అడుగుల కింగ్ కోబ్రాతో గోక్కున్నాడు! నమ్మకుంటే వీడియో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook