IND vs SL: భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడానికి కారణం ఏంటో చెప్పిన రవీంద్ర జడేజా!!

Ravindra Jadeja about Rohit Sharma: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయాలని తానే స్వయంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సందేశం పంపానని ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తెలిపాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 10:14 AM IST
  • భారత్‌, శ్రీలంక తొలి టెస్ట్‌
  • సెంచరీ చేసిన జడేజా
  • ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడానికి కారణం ఏంటో చెప్పిన జడేజా
IND vs SL: భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడానికి కారణం ఏంటో చెప్పిన రవీంద్ర జడేజా!!

Jadeja said I told to Captain Rohit to declared the innings: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 574/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు రెండో సెషన్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (175 నాటౌట్; 228 బంతుల్లో 17x4, 3x6) డబల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో ఉండగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. రోహిత్ నిర్ణయంతో ప్రతిఒక్కరు షాక్ అయ్యారు. రోహిత్ నిర్ణయాన్ని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు తప్పుబట్టారు. డబుల్ సెంచరీ పూర్తయ్యే వరకు ఆగాల్సిందని అభిప్రాయపడ్డారు.

కొందరు ఫాన్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. ద్రవిడ్‌ కావాలనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో డిక్లేర్‌ చేయించాడని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ద్రవిడ్‌ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో పాకిస్థాన్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచులో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (194) పరుగుల వద్ద ఉండగా ఇలాగే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడని, ఇప్పుడు రవీంద్ర జడేజా కూడా 175 పరుగుల వద్ద ఉండగా మరోసారి డిక్లేర్‌ చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం జడేజా స్పందించాడు.  ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయాలని తానే స్వయంగా సందేశం పంపానని తెలిపాడు. 

మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడుతూ... 'నా డబుల్ సెంచరీ పూర్తయిన తర్వాతనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ఇస్తామని కుల్దీప్ యాదవ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ సందేశం పంపించాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. పిచ్‌పై బంతి బౌన్స్‌ అవడం మొదలైందని చెప్పా. పిచ్‌ సహకరించడం మొదలైన నేపథ్యంలో ప్రత్యర్థిని బ్యాటింగ్‌ దించాలని సూచించా. ప్రత్యర్థి బ్యాటర్ల అలసటను సొమ్ము చేసుకోవాలనుకున్నాం. ఫీల్డింగ్ చేసి అలసిపోయిన శ్రీలంక ఆటగాళ్లను బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తే.. త్వరగా వికెట్లు తీయవచ్చని భావించాను' అని చెప్పాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేయడానికి కారణం రవీంద్ర జడేజానే. ముందుగా ఆర్ అశ్విన్‌ (61; 82 బంతుల్లో 8x4)తో కలిసి 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా.. ఆపై మొహ్మద్ షమీ (20 నాటౌట్‌; 34 బంతుల్లో 3x4)తో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. చివరికి భారత్ 574/8 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించగా ఆట ముగిసే సమయానికి 108/4 స్కోర్‌తో నిలిచింది.

Also Read: Shane Warne: 10 సంవత్సరాల క్రితం వైన్ కూడా ఉంది.. మరణానికి ముందు ఏం జరిగిందో చెప్పిన షేన్‌ వార్న్‌ మేనేజర్‌!!

Also Read: Cat bite : షాకింగ్ న్యూస్.. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News