Obed McCoy: నేను మా అమ్మ కోసం క్రికెట్ ఆడుతున్నా.. ఈ ప్రదర్శన ఆమెకే అంకితం: మెకాయ్‌

Obed McCoy dedicated his six-wicket haul to his mother. విండీస్‌ బౌలర్‌ ఒబెద్‌ మెకాయ్‌ మాట్లాడుతూ ఈ ప్రదర్శనను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 2, 2022, 10:49 AM IST
  • అమ్మ కోసం క్రికెట్ ఆడుతున్నా
  • ఈ ప్రదర్శన అమ్మకే అంకితం
  • బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలు
Obed McCoy: నేను మా అమ్మ కోసం క్రికెట్ ఆడుతున్నా.. ఈ ప్రదర్శన ఆమెకే అంకితం: మెకాయ్‌

Obed McCoy dedicated his six-wicket haul to his mother: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్‌ విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ బ్రాండన్ కింగ్ (68; 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. డెవాన్ థామస్ (31 నాటౌట్; 19 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) కీలక సమయంలో రాణించాడు. ఈ విజయంతో విండీస్‌ పొట్టి సిరీస్‌ను 1-1తో సమంగా మారింది.

వార్నర్ పార్క్‌కు రెండు జట్ల లగేజీ ఆలస్యంగా రావడంతో రెండో టీ20 మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఆరంభం అయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లను విండీస్‌ బౌలర్‌ ఒబెద్‌ మెకాయ్‌ ముప్పతిప్పలు పెట్టాడు. అద్భుత బౌలింగ్‌తో తన టీ20 కెరీర్‌లోనే బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చిన మెకాయ్‌.. ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. ఇందులో ఒక మెయిడెన్‌ ఓవర్ కూడా ఉండడం విశేషం. 

సంచలన బౌలింగ్‌తో సత్తాచాటిన ఒబెద్‌ మెకాయ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం మెకాయ్‌ మాట్లాడుతూ ఈ ప్రదర్శనను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. 'నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నేను మా అమ్మ కోసం క్రికెట్ ఆడుతున్నాను. ఆమె అనారోగ్యంతో ఉంది. అయినా కూడా నన్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండేది. ఈ ప్రదర్శనను అమ్మకు అంకితం ఇస్తున్నా. నా ప్రదర్శనతో మా అమ్మ కోలుకుంటుంది. అమ్మ ప్రోత్సాహం మెరుగైన ఆటగాడిగా మారేందుకు ప్రేరేపిస్తోంది' అని మెకాయ్‌ చెప్పాడు. 

'నేను ఎప్పుడూ పవర్‌ ప్లేలో వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే వికెట్స్ తీస్తే బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెరిగి ఎక్కువగా పరుగులు చేయలేరు. తొలి టీ20లో 7.50 ఎకానమీ రేటుతో ఒక వికెట్ తీశాను. ఆ మ్యాచ్ ప్రదర్శన గురించి ఎక్కువగా ఆలోచించా. పవర్‌ప్లేలో బౌలింగ్ చేయడం అంటే పెద్ద సవాలు. అయితే అది అనుభవాన్ని ఇవ్వడంతో పాటుగా ఆటగాడిగా మెరుగయ్యేందుకు సహాయపడుతుంది' అని ఒబెద్‌ మెకాయ్‌ చెప్పుకొచ్చాడు. 

Also Read: Venus Transit 2022: ఆగస్ట్ 7 నుంచి 23 రోజులపాటు ఈ రాశులపై డబ్బు వర్షం!

Also Read: Horoscope Today August 2nd: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అనుకోని వివాదంలో చిక్కుకునే ఛాన్స్..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News