IND vs AUS 2ND T20I Live Updates: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

IND vs AUS 2ND T20I Live Updates:  నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ టీ20లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ నెగ్గి, బౌలింగ్ ఎంచుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆస్ట్రేలియాపై ఆధిక్యంలో ఉంది.

Last Updated : Dec 6, 2020, 01:47 PM IST
IND vs AUS 2ND T20I Live Updates: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

IND vs AUS 2ND T20I Live Updates | నేడు ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ టీ20లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ నెగ్గి, బౌలింగ్ ఎంచుకున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆస్ట్రేలియాపై ఆధిక్యంలో ఉంది. కాగా, కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించడం తెలిసిందే.

Also Read : Yuzvendra Chahal: మొన్న చితక్కొడితే.. నేడు ఆసీస్‌తో చెడుగుడు! 

 

నేటి మ్యాచ్‌కు ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో మాథ్యూ వేడ్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. భారత్ నుంచి ఈ మ్యాచ్‌కు ఆల్ రౌండర్ జడేజా దూరమయ్యాడు. తొలి టీ20లో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు జడేజా. అయితే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెల్మెట్‌కు బంతి తగలడంతో తల అదిరింది. దీంతో అసౌకర్యంగా కనిపించిన జడేజా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తెలిపాడు. రిఫరీకి విషయం చెప్పడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ బరిలోకి దిగాడు. కీలకమైన 3 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం తెలిసిందే. 
Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 

ఇరుజట్ల వివరాలు:

టీమిండియా: శిఖర్ ధావన్‌, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, యుజువేంద్ర చాహల్, శార్దూల్‌ ఠాకూర్

ఆస్ట్రేలియా: షార్ట్‌, మార్కస్ స్టాయినిస్‌, స్టీవ్‌ స్మిత్‌, హెన్రిక్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), డేనియల్ సామ్స్‌, అబాట్‌, ఆండ్రూ టై, స్వెప్సన్‌, ఆడమ్ జంపా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News