India vs Australia 4th Test: వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత

India vs Australia 4th Test: Washington Sundar and Shardul Thakur in record stand at Gabba: ఆస్ట్రేలియా గడ్డ మీద జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించారు. కీలక ఆటగాళ్లు వెనుదిరిగినా గబ్బా వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో సత్తా చాటుతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 17, 2021, 11:32 AM IST
  • అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
  • గబ్బాలో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత ఆటగాళ్లు
  • ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి విజయవంతమైన వాషింగ్టన్ సుందర్, ఠాకూర్
India vs Australia 4th Test: వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత

India vs Australia 4th Test: Washington Sundar and Shardul Thakur in record stand; ఆస్ట్రేలియా గడ్డ మీద జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించారు. కీలక ఆటగాళ్లు వెనుదిరిగినా గబ్బా వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో సత్తా చాటుతున్నారు. ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన భారత ఆటగాళ్లుగా సుందర్, ఠాకూర్ నిలిచారు. 7వ వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా ఇంకా ఆటను కొనసాగిస్తున్నారు.

ఆసీస్ గడ్డమీద గబ్బా వేదికగా జరుగుతున్న టెస్టుల్లో ఏడో వికెట్‌కు ఇప్పటివరకూ భారత(Team India) ఆటగాళ్లు నమోదు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. అయితే ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (49 ; 106 బంతుల్లో 7 ఫోర్లు), శార్దూల్ ఠాకూర్ (55 ; 93 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. భారత జట్టు టీ సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.

Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన

ప్రస్తుతం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 291 పరుగుల చేయగా వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) క్రీజులో ఉన్నారు. 3 రన్‌రేట్‌తో సులువగా ఆసీస్ పేస్, స్పిన్ బౌలింగ్ దాడిని సులువుగా ఎదుర్కొంటూ భారత స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. నాలుగో టెస్టు మూడో రోజు ప్రస్తుతానికి మరో 27 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

Also Read: Devdutt Padikkal టీమిండియాలోకి రావడం ఖాయమేనా?

అంతకుముందు కెప్టెన్ అజింక్య రహానే(37 ; 93 బంతుల్లో 3 ఫోర్లు), చటేశ్వర్ పుజారా(25 ; 94 బంతుల్లో 2 ఫోర్లు), రిషభ్ పంత్(23) ఔటయ్యారు. హేజల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టగా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ తలో వికెట్ తీశారు. కొత్త కుర్రాళ్లు వాషింగ్టన్ సుందర్(Washington Sundar), శార్దూల్ ఠాకూర్‌లు ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి విజయవంతమయ్యారు.

Also Read: Jacques Kallis: జాతీయ జట్టుకు జీవితంలో కోచ్ కాలేడు.. కారణమేంటో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News