Ind vs Aus T20 Series: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి బాధ మర్చిపోకముందే టీమ్ ఇండియా తిరిగి అదే ప్రత్యర్ధితో మరో టోర్నీ ఆడుతోంది. ఇవాళ్టి నుంచి ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. హెడ్ కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇలా మొత్తం జట్టంతా కొత్త కుర్రాళ్లతో ఆసీస్‌తో పోరుకు సిద్ధమైంది.
టీమ్ ఇండియా కొత్త టీమ్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 3 వరకూ ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు బీసీసీఐ సీనియర్ క్రికెటర్లు అందరికీ విశ్రాంతినిచ్చింది. సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో కుర్రాళ్లతో కొత్త టీమ్ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇండియాకు ఇది అసలైన సవాలు కానుంది. ప్రపంచకప్‌లో విఫలమైన సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా నిరూపించుకునేందుకు మంచి అవకాశం. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్‌గా, రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ అవకాశమిచ్చింది. శ్రేయస్ అయ్యర్ మాత్రం చివరి రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాడు.
ఇవాళ తొలి మ్యాచ్ విశాఖపట్నంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ కూడా మారాడు. ద్రావిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి కోచ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా. బూమ్రా, షమీ, సిరాజ్‌లు విశ్రాంతినిచ్చారు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఇంకా ఇండియాకు దూరంగా ఉన్నాడు.
తొలి టీ20 మ్యాచ్ నవంబర్ 23 విశాఖపట్నంలో
రెండవ టీ20 మ్యాచ్ నవంబర్ 26 తిరువనంతపురంలో
మూడవ టీ20 మ్యాచ్ నవంబర్ 28 గౌహతిలో
నాలుగవ టీ20 మ్యాచ్ డిసెంబర్ 1న రాయ్‌పూర్‌లో
ఐదవ టీ20 మ్యాచ్ డిసెంబర్ 3న బెంగళూరులో
టీమ్ ఇండియా జట్టు
సూర్య కుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్
ఆస్ట్రేలియా జట్టు
మాధ్యూవేడ్, ఆరోన్ హార్దీ, జాసన్ బెహ్రెనార్డ్, సీన్ అబాట్, టీమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్ సన్, ఆడం జంపా
Also read: Sara Tendulkar: ఆ ఫొటోలపై స్పందించిన సారా టెండూల్కర్.. నాకు అసలు అకౌంటే లేదంటూ ట్విస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ind vs Aus T20 Series: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్, విజయం వరించేనా