Ind vs SA: సఫారీల గడ్డపై టీమ్ ఇండియా తొలి టీ20 మ్యాచ్, పిచ్ రిపోర్ట్ ఇలా

Ind vs SA: టీమ్ ఇండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. మిస్టర్ 360 సూర్య సారధ్యంలో మరో సిరీస్‌పై కన్నేసింది. రెండు జట్ల బలాబలాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 10, 2023, 08:25 AM IST
Ind vs SA: సఫారీల గడ్డపై టీమ్ ఇండియా తొలి టీ20 మ్యాచ్, పిచ్ రిపోర్ట్ ఇలా

Ind vs SA: సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలో స్వదేశంలో కుర్రోళ్లతో నిండిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో జరిగిన 5 టీ20ల సిరీస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో గట్టి ప్రత్యర్ధి దక్షిణాఫ్రికాతో సఫారీల గడ్డపై ఆడేందుకు సిద్ధమైంది. ఇవాళ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. 

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ కైవసం చేసుకున్న సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలోని టీమ్ ఇండియాకు అసలు సిసలు సవాల్ ఇది. విదేశీ గడ్డపై అందులోనూ దక్షిణాఫ్రికాలో ఆ దేశంతో తలపడటం. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20లకు సూర్య కుమార్ యాదవ్ సారధ్యం వహించనుండగా, వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. సఫారీలతో రోహిత్ శర్మ సారధ్యంలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. మరి కొద్దిరోజుల్లో జరగనున్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించాలంటే టీమ్ ఇండియా యవ ఆటగాళ్లకు అదే మంచి అవకాశం. సఫారీలతో జరిగే టీ20 మ్యాచ్‌లలో కనబర్చే ప్రతిభ డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 వేలంలో పనికొస్తుంది. 

దక్షిణాఫ్రికా సిరీస్‌కు శుభమన్ గిల్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్ జట్టులో చేరడం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశం. టీమ్ ఇండియాలో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లో ఉండటం ప్రత్యర్ధికి ఇబ్బందికరమే. రవి బిష్ణోయ్, అర్షదీప్‌లకు సిరాజ్ తోడవడంతో మరింత ప్లస్ కానుంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా బవుమా, నోర్జే, ఇన్‌గిడిలు లేకుండానే కొత్త ముఖాలతో బరిలో దిగుతోంది. సఫారీలకు మార్క్‌రమ్ నేతృత్వం వహించనున్నాడు. సొంతగడ్డపై ఆడుతుండటం అనుకూలాంశం. సత్తా చాటే హెండ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్ , కోయెట్జీ, షమ్సీ, కేశవ్ మాహారాజ్ ఉండటం సఫారీలకు లాభించే అంశం. బ్యాటింగ్ అనుకూల పిచ్ కావచ్చు. వర్షం ముప్పు ఉండటంతో ప్రారంభంలో పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు.

టీమ్ ఇండియా 

సూర్య కుమార్ యాదవ్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, కుల్దీప్, రవి బిష్ణోయ్, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్

దక్షిణాఫ్రికా

మార్క్‌రమ్, హెండ్రిక్స్, బ్రీట్జ్ కే, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కోయెట్జీ, బర్గర్, షమ్సీ

Also read: WPL 2024 Auction: పోటాపోటీగా WPL వేలం.. రికార్డు ధర దక్కించుకున్న అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు.. ఈ స్టార్లకు బిగ్‌ షాక్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News