Rashid Khan: టీమిండియాకు అతడు అత్యుత్తమ స్పిన్నర్ అవుతాడు: రషీద్ ఖాన్

IPL 2022 Final GT vs RR. Rashid Khan praises Ravi Bishnoi. ఐపీఎల్ కొత్త ప్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 29, 2022, 06:17 PM IST
  • 14 మ్యాచ్‌లలో 13 వికెట్లు
  • టీమిండియాకు అతడు అత్యుత్తమ స్పిన్నర్ అవుతాడు
  • ఫైనల్లో చహల్ ఒక్క వికెట్ తీసినా
Rashid Khan: టీమిండియాకు అతడు అత్యుత్తమ స్పిన్నర్ అవుతాడు: రషీద్ ఖాన్

Rashid Khan says Ravi Bishnoi could be a big star for India in future: ఐపీఎల్ కొత్త ప్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. బిష్ణోయ్‌ మంచి ప్రతిభావంతుడని, భవిష్యత్తులో టీమిండియాకు స్టార్‌ స్సిన్నర్‌ అవుతాడని రషీద్ జోస్యం చెప్పాడు. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచులో మరికాసేపట్లో రాజస్థాన్‌తో గుజరాత్‌ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. గుజరాత్ తరఫున బరిలోకి దిగుతున్న రషీద్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలపై స్పందించాడు. 

తాజాగా రషీద్ ఖాన్ క్రికెట్.కామ్‌తో మాట్లాడుతూ... 'రవి బిష్ణోయ్ మంచి ప్రతిభావంతుడు. అతడితో నేను చాలా సార్లు మాట్లాడాను. రాబోయే రోజుల్లో టీమిండియాకు స్టార్‌ బౌలర్‌ అవుతాడు. బిష్ణోయ్ తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరచుకుంటే.. అతను ఖచ్చితంగా భారతదేశానికి పెద్ద బౌలర్ అవుతాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయగలడు' అని అన్నాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన రవి బిష్ణోయ్.. 14 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. 

యజువేంద్ర చహల్‌ గురించి రవి బిష్ణోయ్‌ మాట్లాడూతూ... 'యజువేంద్ర చహల్‌ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్. భారత్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆత్యహదు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. చహల్‌ తన బౌలింగ్‌లో అద్భుతమైన స్కిల్స్‌ను ప్రదర్శిస్తాడు' అని పేర్కొన్నాడు. వనిందు హసరంగాతో సమానంగా యుజ్వేంద్ర చహల్‌ 26 వికెట్లను తీసి పర్పుల్ క్యాప్ రేసులో నంబర 1 పొజిషన్లో ఉన్నాడు. ఐపీఎల్ 2022 ఫైనల్లో చహల్ ఒక్క వికెట్ తీసినా పర్పుల్ క్యాప్ అందుకుంటాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలుస్తాడు.

ఐపీఎల్ 2022 టోర్నమెంట్‌లో రషీద్ ఖాన్ ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్‌లలో 18 వికెట్లు పడగొట్టాడు. కేవలం బౌలర్‌గా మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గేమ్‌లో కేవలం 22 బంతుల్లో 40 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రషీద్ ఈ సీజన్‌లో 44 బంతుల్లో 206.82 స్ట్రైక్ రేట్‌తో 91 పరుగులు చేశాడు. ఇక ఫైనల్ మ్యాచులో కూడా చెలరేగాలని  గుజరాత్ టీమ్ కోరుకుంటోంది. 

Also Read: GT vs RR Dream11 Team: ఐపీఎల్ 2022 ఫైనల్ పోరులో గుజరాత్‌, రాజస్తాన్‌ ఢీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!  

Also Read: IPL 2022 Final: ఐపీఎల్ 2022 విజేత ఎవరో చెప్పేసిన హర్భజన్.. రైనా, అక్తర్ ఓటు ఎవరికో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News