IPL 2024: ఐపీఎల్ వర్సెస్ సార్వత్రిక ఎన్నికల మధ్య సంక్లిష్టత ప్రతి ఐదేళ్లకు ఉండేదే. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురుకానుంది. మరో వారంరోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుండగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపధ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లపై ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఐపీఎల్ రెండో విడత మ్యాచ్‌లు యూఏఈకు బదిలీ కానున్నాయనే చర్చ మొదలైంది.
ఐపీఎల్ 2024 రెండు విడతల్లో జరగనుంది. తొలి విడత షెడ్యూల్ మార్చ్ 22 నుంచి ఏప్రిల్ 7 వరకూ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుందో తెలియక బీసీసీఐ తొలి విడత షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది. రెండో విడత షెడ్యూల్ ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్, మే రెండు నెలల్లోనూ దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ మార్చ్ 16 నుంచి మొదలుకుని జూన్ 4న కౌంటింగ్ వరకూ ఉంటుంది. గతంలో 2009, 2014 ఎన్నికల సమయంలో ఐపీఎల్ టోర్నీని దక్షిణాఫ్రికా, దుబాయ్‌లో నిర్వహించింది బీసీసీఐ. కానీ 2019లో మాత్రం ఇండియాలోనే జరిగింది. ఈసారి రెండో విడత మ్యాచ్‌లు యూఏఈలో జరగవచ్చనే వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. రెండో దశ మ్యాచ్‌లు యూఏఈకు బదిలీ కానున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని తోసిపుచ్చారు. ఐపీఎల్ వేదిక మార్పు లేదని త్వరలో రెండో విడత షెడ్యూల్ కూడా విడుదల చేస్తామన్నారు. సీజన్ మొత్తం ఇండియాలోనే జరుగుతుందని, విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదని జై షా స్పష్టం చేశారు. రెండో దశ మ్యాచ్‌లు కూడా ఇండియాలోనే జరగనున్నాయన్నారు. మార్చ్ 22 నుంచి ఏప్రిల్ 7 వరకూ ఐపీఎల్ 2024 సీజన్ 17 తొలి విడత జరగనుంది రెండో విడత షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది.
ఐపీఎల్ 2024 తొలి విడత షెడ్యూల్ ఇలా
మార్చ్ 22- చెన్నైలో సీఎస్కే వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
మార్చ్ 23 -మొహలీలో పంజాబ్ కింగ్స్ లెవెన్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
మార్చ్ 23- కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్
మార్చ్ 24-జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
మార్చ్ 24-అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
మార్చ్ 25-బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్
మార్చ్ 26-చెన్నైలో చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
మార్చ్ 27-హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్
మార్చ్ 28- జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
మార్చ్ 29-బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్
మార్చ్ 30-లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్
మార్చ్ 31-అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్
ఏప్రిల్ 1- ముంబైలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
ఏప్రిల్ 2- బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
ఏప్రిల్ 3- విశాఖపట్నంలో ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్
ఏప్రిల్ 4-అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్
ఏప్రిల్ 5-హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్
ఏప్రిల్ 6-ముంబైలో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్
ఏప్రిల్ 7-లక్నోలో లక్నో సూపర్ జెయిట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
Also read: IPL 2024 Updates: చెన్నై జట్టుకు ఊహించని షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook