Viral Video: మ్యాచ్ చూడటానికి వచ్చిన అశోక్ గెహ్లాట్.. మోదీ అంటూ నినాదాలు చేసిన ప్రేక్షకులు..?

ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ని పొగడటం, అశోక్ గెహ్లాట్, ప్రధాని మోడీని పొగటం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న జరిగిన రాజస్థాన్ Vs లక్నో మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి వచ్చిన అశోక్ గెహ్లాట్ ని చూసి ప్రేక్షకులు మోదీ.. మోదీ అంటూ చేసిన నినాదాలు వైరల్ అవుతున్నాయి. 

Last Updated : Apr 20, 2023, 01:20 PM IST
Viral Video: మ్యాచ్ చూడటానికి వచ్చిన అశోక్ గెహ్లాట్.. మోదీ అంటూ నినాదాలు చేసిన ప్రేక్షకులు..?

Ashok Gehlot: మామూలుగా ఒకరికొకరు ఎప్పుడు పోటీగా ఉంటూ.. అది కాకుండా ఇద్దరి మధ్య బాగా మాటలు యుద్ధం చేసుకునేవాళ్లు.. ఒకేసారి ఒకరికొకరు పొగుడుకుంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే ఇటువంటివి ఎక్కువగా రాజకీయాలలో కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా వేదికపై ఇద్దరు కలిస్తే చాలు లోలోపల ఎన్ని ఉన్నా బయటికి పొగుడుకుంటూ కనిపిస్తూ ఉంటారు.

అయితే అలా కొంత కాలం వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య బాగా మాటల యుద్ధం, పోటీత్వం ఉండగా అయితే ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను పొగడడం మొదలుపెట్టాడు. పలు వేదికలపై ఆయన గురించి గొప్పగా చెబుతూ కనిపించాడు. దీంతో అశోక్ గెహ్లాట్ కూడా నరేంద్ర మోదీ గురించి కూడా గొప్పగా చెప్పడం ప్రారంభించాడు. దీంతో చాలా మంది వీరి మధ్య కనిపిస్తున్న సన్నిహితం చూసి ఆశ్చర్యపోయారు.

వీరిద్దరూ బాగానే కలిసిపోయారు అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే తాజాగా అశోక్ గెహ్లాట్ కనిపించడంతో చాలామంది ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. అసలు విషయం ఏంటంటే..  ప్రస్తుతం ఐపీఎల్ 2023 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై లక్నో గెలుపొందింది.

Also Read: RCB VS PBKS Dream11 Prediction: ఈ రోజు జరిగే పోరులో విజయం సాధించే జట్టు ఇదేనా?, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 ప్రిడిక్షన్‌ వివరాలు!

అయితే ఈ మ్యాచ్ చూడటానికి రాజస్థాన్ సీఎం అయినా అశోక్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆయన రావడానికి గమనించి.. మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. దీంతో ప్రేక్షకులు ఏ విధంగా ఉద్దేశించి అలా నినాదాలు చేశారో తెలియదు కానీ.. ప్రస్తుతం బీజేపీ నాయకులు అది చూసి బాగా మురిసిపోతున్నారు. ఇక దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Also Read: Arjun Tendulkar Maiden IPL Wicket: ఆడింది రెండు మ్యాచ్‌లే.. తండ్రి సచిన్‌నే అధిగమించిన అర్జున్‌ టెండూల్కర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News