IPL Winners List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో తొలిసారిగా అంకురార్పణ జరిగింది. అప్పట్నించి ఇప్పటి వరకూ నిలిచిన జట్లు చాలా ఉన్నాయి. మధ్యలో కొన్నిజట్లు నిష్క్రమించాయి. కొన్ని పేరు మార్చుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అంటే మొత్తం 16 సీజన్లలో చెరో ఐదు టైటిల్స్‌ను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ గెల్చుకోగా మిగిలిన 6 టైటిల్స్ మాత్రమే ఇతర జట్లకు దక్కాయి.
2008లో తొలిసారిగా ఐపీఎల్ సీజన్ 1 జరిగింది. ఐపీఎల్ 2008లో ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేయగా..రాజస్థాన్ రాయల్స్ చివరి బంతికి విజయం సాధించి మొదటి ఛాంపియన్‌గా నిలిచింది.
2009లో ఐపీఎల్ సీజన్ 2 ఫైనల్లో దెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ లేదా ఇప్పటి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆర్సీబీను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెల్చుకుంది.
2010లో ఐపీఎల్ సీజన్ 3 ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్..ముంబై ఇండియన్స్ జట్టును 22 పరుగుల తేడాతో ఓడించి మొదటి సారి టైటిల్ గెల్చుకుంది.
2011లో ఐపీఎల్ సీజన్ 4లో చెన్నై సూపర్‌కింగ్స్ మరోసారి టైటిల్ సాధించింది. వరుసగా రెండుసార్లు టైటిల్ గెల్చిన జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఫైనల్లో 58 పరుగుల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది.
2012లో ఐపీఎల్ సీజన్ 5లో నాటి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి టైటిల్ గెల్చుకుంది.
2013లో ఐపీఎల్ సీజన్ 6లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి టైటిల్ గెల్చుకుంది.
2014లో ఐపీఎల్ సీజన్ 7లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు..పంజాబ్ కింగ్స్ లెవెన్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది.
2015లో ఐపీఎల్ సీజన్ 8లో ముంబై ఇండియన్స్ జట్టు..చెన్నై సూపర్‌కింగ్స్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ గెలిచింది.
2016లో ఐపీఎల్ సీజన్ 9లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
2017లో ఐపీఎల్ సీజన్ 10లో ముంబై ఇండియన్స్ జట్టు ఒకే ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ను ఓడించి టైటిల్ గెల్చుకుంది.
2018లో ఐపీఎల్ సీజన్ 11లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు..సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించి టైటిల్ గెలిచింది.
2019లో ఐపీఎల్ సీజన్ 12 ఫైనల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగింది. చివరి బంతికి 1 పరుగు తేడాతో విజయంతో ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించింది.
2020లో ఐపీఎల్ సీజన్ 13లో ఢిల్లీ కేపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచి ఐదవసారి ఛాంపియన్‌గా నిలిచింది.
2021లో ఐపీఎల్ సీజన్ 14లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 27 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ నాలుగవసారి సాధించింది.
2022లో ఐపీఎల్ సీజన్ 15లో తొలిసారి ఐపీఎల్ ఆరంగ్రేటంతోనే ఫైనల్స్ వరకూ చేరి ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచి తొలి టైటిల్ సాధించింది.
ఇక 2023లో ఐపీఎల్ సీజన్ 16లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి చెన్నై సూపర్‌కింగ్స్ ఐదవసారి టైటిల్ సాధించింది.
Also read: Mahindra Singh Dhoni: ధోనీ రిటైర్మెంట్ లేనట్టే, మరో సీజన్ ఆడవచ్చంటున్న మహీ, ఆనందంలో ఫ్యాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook