IPL 2023 Match 68 Kolkata Vs Lucknow Dream11 Team Prediction. ఐపీఎల్ 2023 సీజన్‌లో నేడు డబుల్ హెడ్డర్స్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లక్నోకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది. ఓడితే మాత్రం మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయినా లక్నోకు లాభం చేకూరనుంది. మరోవైపు కోల్‌కతా ఈ మ్యాచ్ గెలిచినా దాదాపుగా ప్లేఆఫ్స్ వెళ్లడం అసాధ్యం. అయితే మెరుగైన స్థానంతో టోర్నీని ముగించాలని కోల్‌కతా భావిస్తోంది.
ప్రస్తుతం లక్నో 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కోల్‌కతాపై గెలిస్తే 17 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడినా అవకాశాలు ఉన్నాయి కానీ.. ముంబై, బెంగళూరు జట్ల ఫలితాలపై ఆధారపడాలి. ముంబై, బెంగళూరు జట్లూ తమ చివరి మ్యాచుల్లో ఒక్క జట్టు ఓడినా.. లక్నోకు బెర్తు ఖాయం. నేటి మ్యాచులో కోల్‌కతాను ఏమాత్రం తక్కువగా అంచనా వేసినా లక్నోకు ఇక్కట్లు తప్పవు. ఎందుకంటే గత మ్యాచ్‌లో చెన్నైను వారి సొంత గడ్డపైనే ఓడించింది. నేటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో కావడంతో కోల్‌కతాను ఆపడం అంత తేలిక కాదు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిస్తే 14 పాయింట్లతో ఏడో స్థానంలోకి వస్తుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
శుక్రవారం రాత్రి కోల్‌కతాలో వర్షం పడటంతో మ్యాచ్ జరగడంపై కేకేఆర్ అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. సొంత మైదానంలో చివరి లీగ్ మ్యాచ్‌ను చూడాలనే ఆశ నెరవేరుతుందో లేదోనని ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే వర్షం మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉంకలిగించదని కోల్‌కతా వాతావరణ శాఖ చెప్పింది. మ్యాచ్ సమయానికి వాన పడే అవకాశాలు చాలా చాలా తక్కువ అని తెలిపింది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే లక్నో ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. ఇదే జరిగితే 16 పాయింట్స్, మెరుగైన రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: రింకు సింగ్, జేసన్ రాయ్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్బాజ్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, సుయాష్ శర్మ, ఎచ్ రాణా.
లక్నో సూపర్ జెయింట్స్: మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మన్కడ్, ఆయుష్ బడోని, స్వప్నిల్ సింగ్, నికోలస్ పూరన్, క్వింటన్ డికాక్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్.
డ్రీమ్11 టీమ్:
వికెట్ కీపర్లు: క్వింటన్ డికాక్ (కెప్టెన్), నికోలస్ పూరన్
బ్యాటర్లు: జాసన్ రాయ్, నితీష్ రాణా, రింకూ సింగ్
ఆల్ రౌండర్లు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ (వైస్), కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్
బౌలర్లు: వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ .
Also Read: Yashasvi Jaiswal: భారత జట్టులో ఆ యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలి: గవాస్కర్
Also Read: Bandla Ganesh Devara : నా టైటిల్ కొట్టేశారు.. ఎన్టీఆర్ దేవరపై బండ్ల గణేష్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.