LSG vs DC Live Score, IPL 2023: ఐపిఎల్ 2023 లో లక్నో సూపర్ జెయింట్స్ కి శుభారంభం లభించింది. భారత్ రత్న శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ బ్యాట్స్ మేన్ కీల్ మేయర్స్ (73 పరుగులు), నికోలస్ పూరన్ (36 పరుగులు) అద్భుతమైన ప్రతిభ కనబర్చడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 193 పరుగులు చేసింది.
194 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లు ఏ దశలోనూ లక్నో సూపర్ జెయింట్స్ కి పోటీనివ్వలేకపోయారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్ మేన్.. ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా వికెట్స్ సమర్పించుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మార్క్ ఉడ్ బౌలింగ్ తో చుక్కలు చూపించి మొత్తం 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒక్కడే 50 పరుగులు మైలు రాయిని దాటగా రిలీ రాస్సో మరో 30 పరుగులు జోడించాడు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్ కే పెవిలియన్ బాటపట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 143 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చాపచుట్టేసింది. ఫలితంగా లక్నో సూపర్ జెయింట్స్ 50 పరుగుల భారీ ఆధిక్యంతో సూపర్ విక్టరీని తమ ఖాతాలో వేసుకుంది.
ఇది కూడా చదవండి : Kaviya Maran To Isha Negi: ఐపిఎల్‌లో హైలైట్ అయిన గాళ్స్.. ఐపిఎల్ 2023 లోనూ సందడి చేసేనా..
ఇది కూడా చదవండి : Rashmika Mandanna Trolls : రికార్డింగ్ డ్యాన్సులు చేసేవారిలా.. రష్మిక మందాన్న వీడియోపై ట్రోల్స్
ఇది కూడా చదవండి : Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK