Sanju Samson On Sandeep Sharma No-ball in RR vs SRH Match: ఆదివారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఊహించని విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ముందుగా ఓడిన సన్‌రైజర్స్.. ఆపై నో బాల్ పుణ్యమాని గెలిచింది. చివరి బంతిని రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ నో బాల్ వేయగా.. సన్‌రైజర్స్ బ్యాటర్ అబ్దుల్ సమద్ సూపర్ సిక్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. దాంతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుందామని భావించిన రాజస్థాన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించడం, ఆఖరి బంతి నోబాల్ కావడంపై రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు. 'ఐపీఎల్ మ్యాచ్‌లు ఇలానే ఉంటాయి. చివరి బంతి వరకు గెలిచేశామనే భ్రమలో ఉండకూడదు. ఫలితం ఎప్పుడైనా మారిపోతుంది. ప్రత్యర్థి జట్టు ఎప్పుడూ విజయం కోసమే పోరాడుతుంది. ఇది సహజం. సందీప్ శర్మపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే చెన్నైతో మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే చివరి బంతి నో బాల్‌గా పడటంతో విజయం దూరమైంది. నో బాల్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. సందీప్ శర్మకు ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు. మేం గెలిచినట్లు సంబరం పడ్డాం కానీ ఒకే ఒక్క బంతితో ఫలితం తారుమారయింది' అని సంజూ అన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి. 18వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రమ్‌లను యుజ్వేంద్ర చహల్ అవుట్ చేయడంతో రాజస్తాన్ రాయల్స్ చేతిలోకి వచ్చింది మ్యాచ్. 19వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు ఇచ్చాడు. గ్లెన్ ఫిలిప్స్ తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా బాదాడు. ఐదో బంతికి ఫిలిప్స్ అవుట్ కావడంతో.. ఆఖరి ఓవర్లో సన్‌రైజర్స్ విజయ సమీకరణం 17 పరుగులుగా మారింది. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్లో తొలి 5 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. చివరి బంతికి అబ్దుల్ సమద్‌ను అవుట్ చేసి రాజస్థాన్ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ బంతి నో బాల్‌గా తేలింది. దాంతో చివరి బంతికి సన్‌రైజర్స్ విజయానికి ఫోర్ అవసరం అయింది. సందీప్ మళ్లీ వేసిన ఆఖరి బంతిని సమద్ సిక్సర్‌గా బాది సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించాడు.
ఈ ,మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ సంజు సామ్సన్ (38 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ఆడాడు. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు), అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపులు ఇన్నింగ్స్ ఆడారు.
Also Read: Tata Tiago Electric Car: ఒక గంటలో పూర్తి ఛార్జ్.. 315 మీలోమీటర్ల ప్రయాణం! బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే
Also Read: Yamaha RD350 Launch 2023: యమహా ఆర్‌డి 350 వచ్చేస్తుంది.. షాకింగ్ వివరాలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.