India Batter Ishan Kishan hits Double Century vs Bangladesh: టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వీరవిహారం చేస్తున్నాడు. బంగ్లా బౌలింగ్‌ను తుత్తుతునియలు చేస్తూ ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్సులతో 200 రన్స్ చేశాడు. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 35వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో ఆ తర్వాతి ఓవర్లో ఔట్ అయ్యాడు. ఇషాన్ ఈ మ్యాచులో 131 బంతుల్లో 210 రన్స్ బాదాడు.
డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఓ ప్రపంచ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్ ఇషాన్ రికార్డుల్లో నిలిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్), డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (219), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (264, 209, 208 నాటౌట్) కిషన్ కంటే ముందున్నారు. 2010లో దక్షిణాఫ్రికాపై సచిన్ వన్డేల్లో మొదటిసారి డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
𝟐𝟎𝟎 𝐑𝐔𝐍𝐒 𝐅𝐎𝐑 𝐈𝐒𝐇𝐀𝐍 𝐊𝐈𝐒𝐇𝐀𝐍 🔥🔥
𝐖𝐡𝐚𝐭 𝐚 𝐬𝐞𝐧𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐡𝐮𝐧𝐝𝐫𝐞𝐝 𝐭𝐡𝐢𝐬 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧.
He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 💥💥#BANvIND pic.twitter.com/Mqr2EdJUJv
— BCCI (@BCCI) December 10, 2022
అంతర్జాతీయంగా ఇప్పటివరకు తొమ్మిది డబుల్ సెంచరీలు నమోదు అయ్యాయి. తొమ్మిది డబుల్ సెంచరీలలో భారత్ బ్యాటర్లు నలుగురు ఆరు ద్విశతకాలు చేశారు. రోహిత్ శర్మ అత్యధికంగా మూడుసార్లు (264, 209, 208 నాటౌట్) డబుల్ సెంచరీలు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోర్ కూడా రోహిత్ (264)దే కావడం గమనార్హం. వీరేంద్ర సెహ్వాగ్ (219), సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్), ఇషాన్ కిషన్ (210) ఈ జాబితాలో ఉన్నారు. మార్టిన్ గప్టిల్ (237), క్రిస్ గేల్ (215), ఫకర్ జామన్ (210) డబుల్ సెంచరీ బాదిన జాబితాలో ఉన్నారు.
Also Read: టవల్‌తో మెట్రో ఎక్కిన యువకుడు.. పడిపడి నవ్వుకున్న అమ్మాయిలు! టవల్ లాగితే పరిస్థితి ఏంటి
Also Read: Zodiac Sign In 2023: కొత్త సంవత్సరంలో ఈ రాశులవారికి తిరుగే లేదు..డబ్బే..డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.