Jay Shah is behind Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. గాయం పేరుతో చివరి నిమిషంలో బంగ్లాదేశ్ టూర్ నుంచి తప్పుకున్న జడేజా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే ఇందుకు కారణం. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి, తన భార్య రివాబా జడేజా ఎన్నికల ప్రచారంలో జడ్డు పాల్గొన్నాడు. దాంతో గాయంతో బాధపడుతున్న జడేజా ఇలా ప్రచారం చేయడం ఏంటని భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత ప్లేయర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా నార్త్ జామ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో భార్యకు మద్దుతుగా జడేజా ప్రచారం చేస్తున్నాడు. తాజాగా భార్యతో ఓ ర్యాలీలో కూడా పాల్గొన్నాడు. అంతేకాదు భారత క్రికెట్ జట్టు జెర్సీలో ఉన్న రవీంద్ర జడేజా పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ప్రచారంలో భాగంగా జడేజా భారత జెర్సీతో ఉన్న ఫోటోలతో బీజేపీ కరపత్రాలు కూడా పంచింది.
రవీంద్ర జడేజాకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చూసిన ఇండియన్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌గా ఉన్నప్పటికీ గాయం పేరు చెప్పి టీమిండియాకు దూరమవ్వడం చాలా అన్యాయం, భార్య తరఫున ప్రచారం కోసమే జడేజా బంగ్లా పర్యటనకు వెళ్ళలేదు అంటూ ఫాన్స్ మండిపడుతున్నారు. జడేజా టూర్‌కు దూరంగా ఉండడం వెనుక పరోక్షంగా బీజేపీ కారణమని, ఈ తతంగం వెనుక అమిత్ షా కొడుకు జై షా ఉన్నాడని అభిమానులు అంటున్నారు. జడేజాపై చర్యలు తీసుకోవాలని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
દ્વારકામાં રવિન્દ્ર જાડેજાની સભામાં ટીખળ, કોઈએ AAPના ખેસ ફેંક્યા#RavindraJadeja #Dwarka #Elections pic.twitter.com/FP4jNV239N
— Gujarat Tak (@GujaratTak) November 26, 2022
గాయం కారణంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజీలాండ్ టూర్ సహా త్వరలో జరగనున్న బంగ్లాదేశ్ టూర్‌కు దూరమయ్యాడు. బంగ్లా పర్యటన డిసెంబర్ 4న మొదలవుతుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 4న తొలి మ్యాచ్ జరగనుంది. 7, 10 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్, డిసెంబర్ 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది.
Also Read: IND Playing XI vs NZ: శార్దూల్, చహల్ ఔట్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఆడే భారత తుది జట్టు ఇదే!
Also Read: FIFA WC 2022: అద్భుత విజయానికి ఊహించని నజరానా, సౌదీ ఆటగాళ్లకు రోల్స్ రాయిస్ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.