ఆఫ్రిది వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత క్రికెటర్లు..

కాశ్మీరీల వేదనను అర్ధం చేసుకోండంటూ, కాశ్మీరీలను కాపాడాలంటూ ఇటీవల మతపరమైన దాడులకు పాల్పడ్డారని పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Last Updated : May 18, 2020, 07:30 PM IST
ఆఫ్రిది వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత క్రికెటర్లు..

న్యూఢిల్లీ: కాశ్మీరీల వేదనను అర్ధం చేసుకోండంటూ, కాశ్మీరీలను కాపాడాలంటూ ఇటీవల మతపరమైన దాడులకు పాల్పడ్డారని పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై భారత ఆటగాళ్లు హార్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ లు గట్టి కౌంటర్ ఇచ్చారు. శిఖర్ ధావన్ ట్వీట్లో పేర్కొంటూ ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాటంలో చేస్తున్న తరుణంలో ఆఫ్రిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ మనదేనంటూ హిందీలో ట్వీట్ చేశాడు.

Also Read: భగ భగ మండిపోతున్న బంగారం ధరలు..

 

ఇదిలాఉండగా యువరాజ్ సింగ్ స్పందిస్తూ మా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీపై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలతో తీవ్ర నిరాశ చెందానని, దేశం కోసం ఆడిన బాధ్యతాయుతమైన భారతీయుడిగా నేను ఇలాంటి వ్యాఖ్యలను ఎప్పటికీ అంగీకరించనని యువరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా  కాశ్మీర్ వివాదాస్పదమైన అంశంగా ఉందని, ఈ అంశంపై చర్చను భారత ప్రభుత్వానికి వదిలేయాలంటూ మరో ఆటగాడు పేర్కొన్నాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News