CSK Coach Stephen Fleming about Ambati Rayudu IPL Retirement: రెండు రోజుల క్రితం (మే 14) ఐపీఎల్‌కు తాను రిటైర్మెంట్ ఇస్తున్నా అని ట్వీట్ చేసి.. కాసేపటి డిలీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు అభిమానులను గందరగోళానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆ ట్వీటుతో రాయుడు ఇంతకు ఐపీఎల్‌కు గుడ్‌బై చేపినట్టా? లేదా? అని ఫాన్స్ అయోమయపడ్డారు. అయితే అదే రోజు చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందిస్తూ.. తెలుగు తేజం రిటైర్ అవ్వట్లేదని చెప్పారు. అయినా ఈ వ్యవహారంపై చర్చ కొనసాగుతూనే ఉంది.
ఆదివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు తుది జట్టులో లేడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమన్యానికి రాయుడుకు మధ్య బేధాభిప్రయాలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ఇదంతా టీకప్పులో తుపాను లాంటిదని పేర్కొన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ... 'గుజరాత్‌తో మ్యాచ్‌లో రాయుడు లేకపోవడం మేము నిరుత్సాహానికి గురి కాలేదు. ఆ ఆరోపణలన్నీ టీకప్పులో తుపాను లాంటివి. అతడు ఇప్ప్పుడు బాగానే ఉన్నాడు. ఇలాంటి చర్చ మా జట్టుపై ప్రభావం చూపదు. నేను చెప్పిందేమీ స్టోరీ కాదు. అంతా బానే ఉంది' అన్నారు.
శనివారం అంబటి రాయుడు ఒక ట్వీట్ చేశాడు. 'ఇది నా చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్న. 13 ఏళ్లుగా మెగా టోర్నీతో నా అనుబంధం కొనసాగింది. రెండు గొప్ప జట్లలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు కృతజ్ఞతలు' అని రాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. అయితే ఆ ట్వీట్‌ను కాసేపటికి డిలీట్ చేశాడు. 2019 ప్రపంచకప్ సమయంలో భారత జట్టుకు రాయుడును బీసీసీఐ ఎంపిక చేయకపోవడంతో.. అతడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
ఐపీఎల్ 2022కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అంబటి రాయుడిని వేలంలోకి వదిలింది. వేలంలో రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. రాయుడు ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 271 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 78 కాగా.. స్ట్రైక్ రేట్ 124.31గా ఉంది. ఈ సీజన్లో 2-3 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 2010 సీజన్‌లో ఐపీఎల్ టోర్నమెంట్‌లో అడుగుపెట్టిన రాయుడు ఇప్పటివరకు 187 మ్యాచ్‌లు ఆడి.. 4187 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100.
Also Read: IPL 2022: ఐపీఎల్ 2018ని బ్రేక్ చేసిన ఐపీఎల్ 2022.. 11 మ్యాచ్‌ల్లో 1000 దాటేనా?
Also Read: F3 Movie: పోరితో సల్సా, రాత్తిరంతా జల్సా.. 'ఎఫ్ 3' స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల! పూజా హెగ్డే స్టెప్స్ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.