Womens T20 World Cup: పురుషులు టీ 20 ప్రపంచకప్ సాధించిన ఉత్సాహంతో భారత మహిళలు పొట్టి ట్రోఫీని చేజిక్కించుకోవడానికి సిద్ధమయ్యారు. ఐసీసీ మెగా క్రికెట్ ఈవెంట్ ప్రారంభమవడంతో ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో లేడీ విరాట్ కోహ్లీగా పేరుపొందిన స్మృతి మంధాన ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్రపంచకప్‌కు ఎలా సన్నద్ధమయ్యారో.. ట్రోఫీని గెలవడానికి తమ వ్యూహాలను ఆమె పంచుకున్నారు. తాను క్రికెట్ నేర్చుకోవడానికి తన తండ్రి కారణమని చెప్పారు. అంతేకాదు తాను కడుపులోనే క్రికెట్ నేర్చుకున్నా అంటూ ఆసక్తికర అంశం చెప్పడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Also Read: Banana Facts: విరాట్ కోహ్లి, సచిన్ రికార్డులకు కారణం అరటి పండు.. ఎందుకో తెలుసా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్మృతి మాట్లాడారు. ఈ సందర్భంగా తన క్రికెట్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. 'మా సోదరుడు కూడా క్రికెట్ ఆడతాడు. అతడితో కలిసి ప్రాక్టీస్ చేసేదానిని. మొదట నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. కానీ క్రికెట్ నేర్చుకోవడం మొదలయ్యాక బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. మా సోదరులు క్రికెట్‌కు బైబై చెప్పేయగా.. మా నాన్న క్రికెటర్ కలను నెరవేర్చే బాధ్యతను తీసుకున్నా' అని స్మృతి మందన్నా వెల్లడించారు.
Also Read: Ind vs Ban Highlights: బంగ్లాను పరిగెత్తించి చితక్కొట్టిన టీమిండియా.. రెండు రోజుల్లోనే ఫినిష్..!
మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన స్మృతి మంధాన మరిన్ని కీలక విషయాలు తెలిపారు. 'నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు క్రికెట్ నేర్చుకున్నానని మా ఇంట్లో జోక్ చేసేదానిని. క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకోవాలనే ఆలోచన చాలా కాలం తర్వాత ఏర్పడింది. 9-10 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభించినట్లు గుర్తుంది. నేను క్రికెటర్ కావడానికి మా అమ్మ చాలా మద్దతుగా నిలిచింది. ఏదైనా చేయాలి అనుకుంటే పూర్తిగా.. నిశితంగా చేయి.. చేతనైనంత పని చేయాలని మా అమ్మ చెప్పేది' అని స్మృతి తెలిపారు. తన స్వస్థలం సాంగ్లీలో కూడా తనకు ఊహించని మద్దతు లభించిందని పేర్కొంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని సాంగ్లీ ప్రజలు కోరుకున్నారని వెల్లడించారు.
కాగా పొట్టి ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్నారు. శుక్రవారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి ప్రపంచకప్‌ను విజయంతో ప్రారంభించాలని భారత క్రికెట్ జట్టు భావిస్తోంది. ఉత్సాహంతో ఉన్న భారత మహిళలు న్యూజిలాండ్‌ను చిత్తు చేసి శుభారంభం చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. కాగా టీ20 ప్రపంచకప్‌కు స్మృతి ఆరోసారి ప్రాతినిథ్యం వహిస్తుండడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter