IND vs PAK: టీ20 ప్రపంచ కప్2021(T20 World Cup 2021)లో భాగంగా..నేడు జరగబోయే భారత్, పాక్ మ్యాచ్(IND vs PAK) పై స్పందించాడు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్(Mohammad kaif). ఈ మ్యాచ్ ను కేవలం ఆటలాగా మాత్రమే చూడాలని..యుద్దంగా చూడొద్దని అభిమానులకు సూచించాడు.
On this nervous morning, one small advice. It is always a great idea to watch cricket by keeping away politics, hate and arrogance. Enjoy the day, celebrate your win not your rivals defeat. Treat it as a game not war. #indvspak
— Mohammad Kaif (@MohammadKaif) October 24, 2021
ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో కోహ్లీ, బాబర్ నాయత్వంలో ఇరుజట్లు పోటీ పడినప్పుడు అభిమానులందరి దృష్టి మ్యాచ్‌పై ఉంటుందని చెప్పాడు. భారత్, పాకిస్తాన్ చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరిస్ అడాయి. ఐసీసీ(ICC), బ్రాడ్‌కాస్టర్ దారులు ఖజానాను నింపుకోవడం కోసం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. “
''ఈ ఉద్రిక్త ఉదయం, ఒక చిన్న సలహా. రాజకీయాలు, ద్వేషం, అహంకారానికి దూరంగా క్రికెట్ ను చూడటం ఎల్లప్పుడూ గొప్ప ఆలోచన. రోజును ఆస్వాదించండి, మీ ప్రత్యర్థి ఓటమిని కాకుండా మీ గెలుపును జరుపుకోండి. దాన్ని యుద్ధంగా కాదు, ఆటలాగా భావించండి. #indvspak'' అని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం తొలిసారి ప్రపంచ కప్ మ్యాచ్‌లో కెప్టెన్‌లుగా తలపడనున్నారు.
Also Read: India Vs Pakistan: టీమిండియాపై గెలిస్తే పాకిస్తాన్ క్రికెటర్లకు బ్లాంక్ చెక్: రమీజ్ రాజా
రోహిత్, బుమ్రాతో జాగ్రత్త: యూనిష్ ఖాన్
ఓపెనర్లు రోహిత్ శర్మ(Rohit Sharma) భారత్‌కు, మహ్మద్ రిజ్వాన్ పాక్‌కు 'మ్యాచ్ విన్నర్లు'అని పాక్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్(Younis Khan) అన్నారు. ఇరువైపుల పేస్ సమానంగా ఉందన్నారు. జస్ప్రిత్ బుమ్రా(Bumrah) ‘'మెన్ ఇన్ గ్రీన్' కి కీలక ముప్పు అని పేర్కొన్నారు. “పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు మంచి స్థితిలో ఉన్నారు. ఇండియా పేస్ విభాగం ఇటీవల కాలంలో బాగా మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బుమ్రా గత కొన్ని నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పాడు. కోహ్లీ, బాబర్‌కు పోలికే లేదన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఇంకా ప్రారంభించలేదు. బాబర్ ఇంకా చిన్నవాడని అభిప్రాయపడ్డాడు. “కోహ్లీ 2008లో నేను ఆడుతున్నప్పుడు అరంగేట్రం చేశాడు అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ గుర్తు చేశాడు. రోహిత్ శర్మ, బుమ్రాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook