MS Dhoni: పోలీస్ ఆఫీసర్‌గా ఎంఎస్ ధోని.. లుక్ అదిరిపోయిందిగా..

MS Dhoni Police Officer Look: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పోలీస్ ఆఫీసర్ పాత్రలోకి మారిపోయాడు. ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదేంటి ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో ఉన్నాడు కదా అని అనుకుంటున్నారా..? అవును.. ఆర్మీ ఆఫీసర్‌గా ఉండగానే పోలీస్ ఆఫీసర్‌గా ఖాకీ డ్రెస్ ధరించాడు. ఎందుకంటే..?

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 12:45 PM IST
MS Dhoni: పోలీస్ ఆఫీసర్‌గా ఎంఎస్ ధోని.. లుక్ అదిరిపోయిందిగా..

MS Dhoni Police Officer Look: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023 కోసం సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించేశాడు. మరోవైపు సినిమా ప్రపంచంలో కూడా తన సత్తా చాటేందుకు ధోని సిద్ధమయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ సంస్థ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ తొలి తమిళ చిత్రాన్ని నిర్మించింది. దాని పేరు 'లెట్స్ గెట్ మ్యారేజ్'. ఈ చిత్రంలో నదియా, హరీష్ కళ్యాణ్, నటి ఇవానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. యోగి బాబు కూడా ఇందులో కీలక పాత్రలో యాక్ట్ చేశాడు. ఈ చిత్రానికి నిర్మాతగా మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఎంఎస్ ధోని పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్‌లో ఉన్న ఓ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యాడ్ షూట్ కోసం మహీ భాయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోకి మారిపోయాడు. ప్రస్తుతం ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాలో ఉన్నాడు ధోని. చాలాసార్లు ఆర్మీ యూనిఫారం ధరించి కనిపించాడు. కానీ ఈసారి ఒక ప్రకటన కోసం పోలీసు యూనిఫామ్ ధరించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. 

ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు ధోని. ఈ దిగ్గజ కెప్టెన్ సారథ్యంలో సీఎస్‌కే నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ 2022కి ముందు ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని విడిచిపెట్టాడు. రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలు అందుకోగా.. వరుసగా జట్టు ఓటమిపాలైంది. దీంతో జడ్డూ మధ్యలోనే కెప్టెన్సీని వదులుకున్నాడు. ఆ తర్వాత ధోనీ మళ్లీ సీఎస్‌కే కెప్టెన్‌గా పగ్గాలు తీసుకున్నాడు. ఈసారి కూడా ధోని జట్టును నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు.

ధోని అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే.. 2004లో డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ తరువాత 2007 సెప్టెంబర్‌లో తొలిసారి ధోనీకి భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ అందుకున్నాడు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లను అందించాడు. టీ20 ప్రపంచ కప్ 2007, ప్రపంచ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 టైటిల్‌ను ధోని సారథ్యంలోనే టీమిండియా గెలుపొందింది.

Also Read:  Ration Shops: రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి వచ్చేసింది  

Also Read: Amul Milk Price Hike: అమూల్ పాల ధర రూ.3 పెంపు.. కొత్త ధరలు ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News