IPL 2022 CSK and MI Qualification Chances: ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అగ్ర జట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ముంబై ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుపొందగా.. చెన్నై నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఈ రెండు జట్లు మెగా టోర్నీలో ఏకచ్ఛత్రాధిత్యాన్ని కొనసాగించాయి. అయితే ఐపీఎల్ 2022లో మాత్రంముంబై, చెన్నై జట్లు దారుణంగా విఫలమయ్యాయి. ప్రస్తుత పరిస్థితిలో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడం అసాధ్యమే అయినా.. చెన్నైకి మాత్ర ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆ లెక్కలు ఏంటో ఓసారి చూద్దాం.
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఆడిన 8 మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా అందుకోలేదు. దాంతో పాయింట్ల పట్టికలో రోహిత్ సేన అట్టడుగు స్థానంలో ఉంది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ప్లే ఆఫ్స్ రేసునుంచి ఇప్పటికే నిష్క్రమించింది. అయితే ఒక్క ఛాన్స్ మాత్రం ఉంది. ఈ సీజన్లో ముంబై ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లను అన్నింటినీ గెలిచినా.. రన్ రేట్ సమస్య వస్తుంది. రన్ రేట్ కూడా బాగానే ఉన్నా.. ఇతర జట్ల గెలుపు, ఓటములపై ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు ఆధారపడి ఉంటాయి. అయితే ముంబై ఒక్క మ్యాచ్ ఓడినా ఆ ఛాన్స్ కూడా ఉండదు.
ఐపీఎల్ 2022లో ఆడిన 8 మ్యాచులలో రెండు విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందువరకు చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. పంజాబ్ చేతిలో ఒదిన తర్వాత అడ్డంకులు పెరిగాయి. చెన్నై ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 6 మ్యాచ్‌లు గెలిస్తే.. 16 పాయింట్లతో చెన్నై క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఐదు మ్యాచ్‌లు గెలిచినా.. ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. అయితే ఇక్కడ నెట్ రన్‌రేట్ పరిగణనలోకి వస్తుంది. ప్రస్తుతం చెన్నై ఉన్న పరిస్థితులలో అన్ని మ్యాచులు గెలవడం కాస్త కష్టమే. చూడాలి మరి ఏదైనా అద్భుతం జరుగుతుందేమో.
మరో మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. కోల్‌కతా ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 గెలిచి.. 5 మ్యాచ్‌ల్లో ఓడింది. ఐపీఎల్ 2022లో కోల్‌కతా ఇంకా 6 మ్యాచ్‌లు ఆడనుంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే కోల్‌కతా 6 మ్యాచ్‌ల్లో 5 గెలవాలి. జట్టు 4 మ్యాచ్‌లు గెలిస్తే మాత్రం.. నెట్ రన్‌రేట్ పరిగణలోకి వస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. ఢిల్లీ మరో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. 5 గెలిచినా సరిపోతుంది. ఇప్పటికే నాలుగు గెలిచిన కింగ్స్ పంజాబ్ మరో 4 మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్స్‌కు వెళుతుంది. మిగతా జట్లకు మరో మూడు విజయాలు అవసరం ఉన్నాయి.
Also Read: Acharya Ticket Price Hike: ఆచార్య టికెట్ల పెంపునకు అనుమతిచ్చిన ఏపీ సర్కార్.. కండిషన్ అప్లై!
Also Read: Eesha Rebba Pics: స్టైలిష్ లుక్‌లో ఈషా రెబ్బా.. తెలుగమ్మాయి మెరిసిపోతుందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.