Fastest Bowler to Pick 100 ODI Wickets: నేపాల్ లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానే చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు రషీద్ ఖాన్ పేరు మీద ఉండగా.. తాజాగా సందీప్ లామిచానే బద్దలు కొట్టాడు. 22 ఏళ్ల లామిచానే కేవలం 42 మ్యాచ్‌ల్లోనే వంద వికెట్లు తీయడం విశేషం. రషీద్ ఖాన్ 44 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో లామిచానే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
రషీద్ ఖాన్ కంటే వేగంగా వంద వికెట్లు తీసి లామిచానే మొదటి ప్లేస్‌లోకి రాగా.. రషీద్ ఖాన్ తరువాత మూడో స్థానంలో ఆసీస్ స్పీడ్ స్టార్ విచెల్ స్టార్క్ ఉన్నాడు. స్టార్క్ 52 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. పాక్ మాజీ స్పిన్నర్ 53 వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టగా.. కివీస్ మాజీ పేసర్ షేర్ బాండ్‌కు 54 మ్యాచ్‌లు పట్టింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫీజురు కూడా 54 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మార్క్ అందుకున్నాడు.
Also Read: AP DSC 2023: నిరుద్యోగులకు తీపికబురు.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
కాగా లైంగిక ఆరోపణలతో సందీప్ లమిచానే జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ యంగ్ ప్లేయర్‌పై నిషేధం విధించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సస్పెన్షన్ ఎత్తివేశారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతడిపై లైంగిక వేధింపుల కేసు నడుస్తోంది. సందీప్ లమిచానే వయసు కేవలం 22 ఏళ్లు. ఇప్పటివరకు 42 వన్డేల్లో 100 వికెట్లు తీయగా.. టీ20 ఫార్మాట్‌లో 44 మ్యాచ్‌లు ఆడి.. 85 వికెట్లు పడగొట్టాడు. లైంగిక వేధింపుల ఆరోపణలకు ముందు లమిచానే నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అంతేకాదు ఐపీఎల్‌లో కాంట్రాక్ట్ పొందిన మొదటి నేపాల్ ప్లేయర్‌గానే సందీప్ నిలిచాడు. 2018లో రూ.20 లక్షలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కొనుగోలు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook