Kainat Imtiaz: టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌ ఓటములు.. మూడు ముక్కల్లో తేల్చేసిన మహిళా క్రికెటర్

Pakistan T20 World Cup 2022: పాక్ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌ వరుస ఓటములకు ఆమె చేసిన ట్వీట్‌ను నెటిజన్లు లింక్ పెడుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 09:46 PM IST
Kainat Imtiaz: టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌ ఓటములు.. మూడు ముక్కల్లో తేల్చేసిన మహిళా క్రికెటర్

Pakistan T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్‌లో వరుస రెండు ఓటములతో పాకిస్థాన్ జట్టు అన్ని వైపులా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆ దేశ మాజీ ఆటగాళ్లే పాక్‌పై విమర్శలు చేస్తున్నారు. భారత్‌ చేతిలో ఓడిపోయినా.. జింబాబ్వే జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగుతో ఓడిపోవడం ఆ దేశ అభిమానులు జీర్ణించులేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మహిళా ప్లేయర్ కైనత్ ఇంతియాజ్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆమె మూడు ముక్కల్లోనే చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది.

'విజువలైజ్, ఫోకస్ అండ్ ఎగ్జిక్యూట్ (విజువలైజ్-ఫోకస్-ఎగ్జిక్యూట్)' అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఇన్నంగా స్పందిస్తున్నారు. బాబర్ అజామ్ సేనకు చెప్పాలంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీ మెన్స్ టీమ్‌ 'లూజ్-క్రై-రిపీట్' అని అంటోందన్నాడు. 'మీరు మెన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండాలి. బాబర్ అజామ్ మీ వుమెన్స్‌ టీమ్‌లో 12వ ప్లేయర్‌గా ఆడాలి..' అంటూ సైటెర్స్ వేశాడు. కైనత్ ఇంతియాజ్ తన నెక్ట్స్‌ మ్యాచ్‌ కోసం ట్వీట్ చేయగా.. నెటిజన్లు మాత్రం పాక్ ఓటమితో లింక్ పెట్టి వైరల్ చేస్తున్నారు.

 

ఇక టీ20 వరల్డ్ కప్‌లో పాక్ సెమీస్‌కు చేరేందుకు మార్గం సంక్లిష్టంగా ఉంది. ఆ జట్టు ఆశలన్నీ భారత్‌పైనే ఉన్నాయి. భారత్ తన తర్వాతి అన్ని మ్యాచ్‌లన్నీ గెలిస్తే.. పాక్ సెమీ ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఉంటాయి. గ్రూప్‌-బిలో భారత్, జింబాబ్వేలపై పరాజయం పాలైన పాక్.. రెండు మ్యాచ్‌ల్లో పాయింట్లు లేకుండా ఐదో స్థానంలో ఉంది. ఇండియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు పాక్ కంటే ముందున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరగబోయే మ్యాచ్‌లు పాకిస్థాన్‌కు కీలకంగా మారాయి.

రేపు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోవాలి. దక్షిణాఫ్రికా టీమిండియా గెలవడంతో పాటు.. నెదర్లాండ్స్‌ను పాకిస్థాన్ ఓడిస్తే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఆ తరువాత జరిగే మ్యాచ్‌ల సమీకరణాల ఆధారంగా పాక్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

Also Read: శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు.. క్షమించండి అంటూ బండ్ల గణేష్ ట్వీట్

Also Read: సమంత స్ట్రాంగ్ ఉమెన్.. పాపం అలా ఇబ్బంది పడింది.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News