Attack On Vikarabad collector incident: వికారాబాద్ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని కూడా ఎద్దేవా చేశారు. అంతే కాకుండా..పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ దిగజారుడు రాజకీయాలు పరాకాష్ట అంటూ ఎద్దేవా చేశారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును.. బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రలు చేస్తున్నారన్నారు.
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.
తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర
కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది.
ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు…
— KTR (@KTRBRS) November 13, 2024
ఏదైన సమస్యలు వస్తే.. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల్ని అణచివేసు కుట్రల్ని సీఎం రేవంత్ చేస్తున్నారని, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని కూడా ఎద్దేవా చేశారు.
పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొవడం ద్వారా.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరింపులకు గురిచేస్తున్నారని కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రజలకోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేస్తే..అది వెర్రీ చర్యే అంటూ కేటీఆర్ సెటైర్ లు వేశారు.
ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసిందని, ఇలాంటి పనులకు వెనక్కు తగ్గేది లేదని కూడా తెల్చిచెప్పారు. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే అరెస్ట్ చేసిన రైతుల్ని, నరేందర్ రెడ్డిని విడుదల చేయాలని కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.