Royal Challengers Bangalore Vs Lucknow Super Giants Playing 11 and Toss Updates: ఈ సీజన్‌లో బోణీ కొట్టేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆర్‌సీబీ.. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. అటు లక్నో తొలి మ్యాచ్‌లో ఓడిపోయి.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో లక్నో ఐదోస్థానంలో ఉండగా.. ఆర్‌సీబీ 8వ స్థానంలో ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన కెప్టెన్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చేశాడు. బెంగళూరు ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అల్జారీ స్థానంలో టోప్లీ తుది జట్టులోకి వచ్చాడు.
Also Read: Best Selling Cars: అమ్మకాల్లో దుమ్ములేపుతున్న కార్లు ఇవే.. ఎగబడి కొనేసిన జనాలు..!
"మేము ఛేజింగ్ చేయబోతున్నాం.. మేము గత మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిగా ఉంది. కొన్ని చోట్ల అతుకులు, పొడిగా ఉంటుంది. మ్యాచ్ తరువాత టీమ్ అంతా మాట్లాడుకున్నాం. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. తప్పుల నుంచి నేర్చుకుంటూ ఉంటే బాగుంటుంది. పిచ్‌పై తేమ టచ్ ఉంది. మ్యాచ్ ఎలా జరుగుతుందో చూద్దాం. అల్జారీ స్థానంలో టాప్లీ తుది జట్టులోకి వచ్చాడు.." ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు.
"ఇక్కడ కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడికి వచ్చి ఇంటి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడం అలవాటు చేసుకున్నాను. నేను విజిటింగ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు కాస్త భిన్నంగా ఉంటుంది. మేము రెండు మ్యాచ్‌లలో మంచి ఆటతీరు కనబర్చాము. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయడం చాలా విశ్వాసాన్ని ఇస్తోంది. మేము ప్రతీ మ్యాచ్‌కు మెరుగవుతున్నాం. మొదటి సీజన్ నుంచి కొంతమంది కుర్రాళ్ళు తమ నైపుణ్యంతో మెరుగవుతున్నారు. మొదటి బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి స్కోరు బోర్డుపై ఎక్కువ పరుగులు ఉంచాలి. ఆ తరువాత ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలి. మయాంక్ పేస్ గురించి అందరూ మాట్లాడుకునే విజయం కంటే ఎక్కువగా ఉంది. మొదటి సీజన్ నుంచి మాతోనే ఉన్నాడు. గాయంతో గత సీజన్‌ను కోల్పోవడం దురదృష్టకరం. ఈ మ్యాచ్‌కు మొహ్సిన్ ఖాన్ స్థానంలో యష్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.." అని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
తుది జట్లు ఇలా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), కామెరున్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), మయాంక్ డాగర్, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ ధయాల్
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్, మయాంక్ యాదవ్.
Also Read: Jasprit Bumrah love story: జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ లవ్ స్టోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి