Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!

Rinku Singh Hat Trick Sixes In Super Over: రింకూ సింగ్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఐపీఎల్‌తో బాదుడు మొదలు పెట్టిన ఈ హార్డ్ హిట్టర్.. సిక్సర్ల వర్షంతో అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా యూపీ టీ20 లీగ్‌లో సూపర్‌ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగి తన జట్టును గెలిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 1, 2023, 08:37 AM IST
Rinku Singh: మళ్లీ సిక్సర్ల వర్షం కురిపించిన రింకూ సింగ్.. సూపర్ ఓవర్‌లో మెరుపులు.. వీడియో చూశారా..!

Rinku Singh Hat Trick Sixes In Super Over: హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ మెరుపులు కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై వరుసగా 5 సిక్సర్లు కొట్టి కేకేఆర్‌ను గెలిపించిన ఈ యంగ్ ప్లేయర్.. మరోసారి అలాంటి ఫీట్‌ను నమోదు చేశాడు. యూపీ టీ20 లీగ్‌లో సూపర్‌ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. దీంతో కాశీ రుద్రస్‌పై మీరట్ మావెరిక్స్ జట్టు ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించింది. గురువారం కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రింకూ సింగ్ హ్యాట్రిక్ సిక్సర్ల మోత మోగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో త్వరలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
యూపీ టీ20 లీగ్ మూడో మ్యాచ్‌లో మీరట్ జట్టు కాశీతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన మావెరిక్స్ 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. మావెరిక్స్ తరఫున మాధవ్ కౌశిక్ 52 బంతుల్లో 4 సిక్సర్లు, 9 ఫోర్లతో 87 నాటౌట్‌గా నిలిచాడు. రింకూ సింగ్ 15 పరుగులు చేశాడు.  కాశీ రుద్రస్ బౌలర్లలో శివ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కాశీ రుద్రస్ టీమ్ కూడా 7 వికెట్లకు 181 పరుగులే చేసింది. దీంతో రెండు జట్లు స్కోర్లు సమం అయ్యాయి. ఓపెనర్ కరణ్ శర్మ (58), శివమ్ బన్సాల్ (57) రాణించగా.. అంకుర్ మాలిక్ 28 పరుగులతో పోరాడాడు. అతను చివరి బంతికి రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయింది. 

ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో కాశీ రుద్రస్ జట్టు 6 బంతుల్లో 16 పరుగులు చేసింది. వమ్ బన్సాల్ 10 పరుగులు చేయగా.. మహ్మద్ షరీమ్ ఓ సిక్సర్ బాదాడు. అనంతరం ఓపెనర్‌గా వచ్చిన రింకూ సింగ్ శివ సింగ్ వేసిన తొలి బంతికి పరుగులేమి చేయలేదు. అనంతరం మూడు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచి.. మావెరిక్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

 

ఇక రింకూ సింగ్ ఐపీఎల్‌లో మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  14 మ్యాచ్‌ల్లో 474 పరుగులు చేసి ఈ సీజన్‌లో కేకేఆర్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండో టీ20 మ్యాచ్‌లో 21 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. భవిష్యత్‌లో రింకూ సింగ్ టీమిండియాకు మంచి ఫినిషర్ అవుతాడని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Kushi Twitter Review: ఖుషి మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఇదే..!  

Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News