Rohit Sharma Tweet: రోహిత్ శర్మకు ముందే తెలుసా?.. మూడేళ్ల క్రితం నాటి ట్వీట్‌ వైరల్‌!!

Rohit Sharma 3 year old tweet goes Viral: భారత టెస్ట్ కెప్టెన్​గా రోహిత్​ శర్మను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రోహిత్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 05:07 PM IST
  • టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ
  • వైరల్‌గా మారిన రోహిత్‌ శర్మ ట్వీట్‌
  • రోహిత్ శర్మకు ముందే తెలుసా?
Rohit Sharma Tweet: రోహిత్ శర్మకు ముందే తెలుసా?.. మూడేళ్ల క్రితం నాటి ట్వీట్‌ వైరల్‌!!

Rohit Sharma 3 year old tweet goes Viral: స్వదేశంలో శ్రీ‌లంక‌తో జ‌రిగే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌, రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు భారత జ‌ట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఎంపిక చేసింది. టెస్ట్ కెప్టెన్​గా రోహిత్​ శర్మను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ చెప్పారు. దీంతో రోహిత్‌ మూడు ఫార్మాట్లకూ సారథిగా ఎంపికయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో​ టెస్ట్‌ సిరీస్‌లో ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ టెస్ట్‌ కెప్టెన్సీని వదిలేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారని అంతా ఆసక్తిగా చూడగా.. బీసీసీఐ అందుకు తెరదించింది. 

గతేడాది టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. దాంతో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆపై పరిమిత ఓవర్లకు ఒకడే కెప్టెన్ ఉండాలని బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి కోహ్లీని తప్పించింది. హిట్‌మ్యాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అందుకున్నాడు. తాజాగా టెస్టు పగ్గాలు కూడా విరాట్ వదులుకోవడంతో రోహిత్‌ మూడు ఫార్మాట్లకూ సారథిగా ఎంపికయ్యాడు. 

అయితే రోహిత్‌ శర్మ గతంలో చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. శనివారం హిట్‌మ్యాన్‌ను బీసీసీఐ కొత్త టెస్టు సారథిగా నియమించాక ఈ ట్వీట్ నెట్టింట ప్రత్యక్షమైంది. 2018 సెప్టెంబర్‌ 1న రోహిత్ ట్విటర్‌లో #AskRohit పేరిట అభిమానులతో  ముచ్చటించగా.. 'మీ ఫేవరెట్‌ కొటేషన్‌ ఏంటి' అని ఓ అభిమాని అడిగారు. 'తనని ఎంత అణచివేస్తే.. అంత పైకి తిరిగొస్తా' అని రోహిత్ అతడికి సమాధానం చెప్పాడు. అదే ఇప్పుడు వైరల్ అయింది. 'కెప్టెన్ అవుతానని రోహిత్ శర్మకు ముందే తెలుసా?' అంటూ ఫాన్స్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 

శ్రీ‌లంక‌ పర్యటనకు భారత జట్టును ప్రకటించాక #BCCIPolitics #WriddhimanSaha, #BCCI అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్ ఖాతాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇందుకు కారణం లేకపోలేదు. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను ఎంపిక చేయలేదు. జట్టు ప్రకటించాక సాహా మాట్లాడుతూ.. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనని రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలని సూచించాడని పెద్ద బాంబ్ పేల్చాడు. అనంతరం ఓ ట్వీట్‌ చేసిన సాహా.. తనని ఇంటర్వ్యూ ఇవ్వాలని ఓ జరల్నిస్టు వాట్సాప్‌లో బలవంతం చేశాడని పేర్కొన్నాడు. దాంతో బీసీసీఐలో రాజకీయాలు జరుగుతున్నాయి అంటూ నెటిజన్లు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. 

Also Read: Viral Video: గుండెలు పిండేసిందిగా.. హోమ్ సిక్‌లో ఉన్న అబ్బాయిని ఓదార్చుతున్న అమ్మాయి!

Also Read: Amazon Hitachi AC: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News