South Africa vs Australia 2nd Semifinal Highlights: ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకోవాలన్న దక్షిణాఫ్రికా కల చెదిరిపోయింది. ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతోపోయి కన్నీళ్లతో ఇంటిముఖం పట్టింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గొప్పగా పోరాడినా లాభం లేకపోయింది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆసీస్.. ఫైనల్‌లో భారత్‌తో పోరుకు సిద్దమైంది. 2003 ఫైనల్ పోరు రీపిట్ కానుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. కీలకపోరులో డేవిడ్ మిల్లర్ (101) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో తక్కువస్కోరుకే పరిమితమైంది. అనంతరం ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ట్రావిస్ హెడ్ (62) రాణించాడు. కీలక సమయాల్లో సౌతాఫ్రికా క్యాచ్‌లు వదిలేయడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు.
సౌతాఫ్రికా విధించిన 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (48 బంతుల్లో 62, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29, ఒక ఫోర్, 4 సిక్స్‌లు) సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. అయితే స్పినర్ల రాకతో సౌతాఫ్రికా మ్యాచ్‌లో పోటీలోకి వచ్చింది. తొలి బంతికే మర్క్‌క్రమ్ డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేశాడు. కాసేపటికే మిచెల్ మార్ష్ (0)ను రబడా పెవిలియన్‌కు పంపించాడు. లబూషేన్ (18), మ్యాక్స్‌వెల్ (1) కూడా విఫలమయ్యారు. అయితే ట్రావిస్ హెడ్‌కు తోడు స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30, 2 ఫోర్లు), వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్ (28) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో లక్ష్యం దిశగా అడుగులు వేసింది. చివర్లో ఉత్కంఠ నెలకొన్నా.. మిచెల్ స్టార్క్ (16 నాటౌట్), పాట్ కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడి విజయ తీరాలకు చేర్చారు. సఫారీ బౌలర్లలో షంసి, కొయెట్టీ తలో రెండు వికెట్లు తీయగా, రబాడ, మార్‌క్రమ్, కేశవ్ మహరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా పూర్తిగా తడబడింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101, 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) చివరివరకు ఒంటరిపోరాటం చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (48 బంతుల్లో 47, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. హేజిల్‌వుడ్, హెడ్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నెల 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి