Sunrisers Hyderabad vs Lucknow Super Giants Playing XI Dream11 Team Tips: ఐపీఎల్‌లో నేడు కీలక సమరం జరగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. రెండు జట్లు కూడా ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 12 పాయింట్లతో సమానంగా ఉన్నా.. నెట్‌రన్ రేట్‌తో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు, లక్నో ఆరోస్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాలు మరింత మెరుగవుతాయి. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్ చేతిలో హైదరాబాదో ఓడిపోగా.. లక్నో సూపర్ జెయింట్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడించింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. హైదరాబాద్, లక్నోలు ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ లక్నోనే విజయం సాధించింది. చివరగా గతేడాది 13న ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ నగరంలో నేడు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అభిమానుల్లో కలవరం నెలకొంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండగా.. వాతావరణం దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పేసర్లు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోగా.. స్పిన్నర్లకు పిచ్ నుంచి కొంత సహకారం లభించవచ్చు. గూగుల్ విన్ ప్రాబబిలిటీ ప్రకారం.. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచే అవకాశం 55 శాతం ఉంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad Predicted XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మార్కో జాన్సెన్, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants Predicted XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), అర్షిన్ కులకర్ణి, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అష్టన్ టర్నర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్.
SRH Vs LSG Dream11 Team:
==> వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, నికోలస్ పూరన్
==> బ్యాటర్స్: ట్రావిస్ హెడ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ
==> ఆల్ రౌండర్లు: మార్కస్ స్టోయినిస్, నితీష్ రెడ్డి
==> బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్, యశ్ ఠాకూర్, మొహ్సిన్ ఖాన్
Also Read: Rashmi Gautam: ట్రోలర్ కి రష్మీ షాకింగ్ రిప్లై.. రేపు నీ పిల్లలని చంపుతాడు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter