India Vs South Africa T20 World Cup: ఆసియా కప్‌లో ఓటమి తరువాత టీమిండియా తేరుకుంది. టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో గ్రూప్-బిలో పాయింట్స్‌లో అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా పాకిస్థానపై అద్భుత విజయం తరువాత టీమిండియా ఆటగాళ్లలో పూర్తి ఆత్మవిశ్వాసం నెలకొంది. పసికూన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో అదరగొట్టగా.. బౌలింగ్‌లో భువననేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ రాణించారు.
ఆదివారం పటిష్ట సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. గ్రూప్ టాప్‌లో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు సెమీఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ను తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మీడియాతో మాట్లాడారు.దక్షిణాఫ్రికాతో పెర్త్‌లో జరిగే మ్యాచ్‌కు రిషబ్ పంత్ లేదా లోకేష్ రాహుల్ ఎవరికి అవకాశం ఇస్తారనే మీడియా ప్రతినిధులు ప్రశ్నించాఉఉ. 'ప్రస్తుతం ఓపెనింగ్ జోడీలో ఎలాంటి మార్పు లేదు. కేఎల్ రాహుల్ ప్లేస్‌లో రిషబ్ పంత్‌ను టాప్-11లో తీసుకురావడం లేదు. ప్రస్తుతం ఉన్న తుది జట్టు చాలా బాగుంది. పెర్త్‌లో లోకేష్ రాహుల్ ఆడతాడు. అయితే పంత్‌ను సిద్ధంగా ఉండాలని చెప్పామని.. త్వరలో జరిగే మ్యాచ్‌ల్లో అవకాశం కల్పిస్తామని చెప్పాం..'అని ఆయన తెలిపారు.
పెర్త్ పిచ్ కూడా దక్షిణాఫ్రికా పేస్ అటాక్‌కు సహకరిస్తుందని విక్రమ్ రాథోర్ అభిప్రాయపడ్డారు. అయితే భారత్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉండడంతో ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగితే పెర్త్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే తమ లక్ష్యమన్నారు. వాతావరణం కారణంగా తక్కువ ఓవర్ల మ్యాచ్ జరగితే ఎలా అని ప్రశ్నించగా.. జట్టును పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం భారత్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించి 4 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. అదే సమయంలో జింబాబ్వేతో దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షంలో కొట్టుకుపోయింది. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 104 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఆ జట్టు 3 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. బంగ్లాపై ఆ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపింది. టీమిండియాతో పోరు రసవత్తరంగా సాగనుంది.
Also Read: DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒకేసారి భారీ మొత్తం ఖాతాల్లోకి..!
Also Read: TRS MLAS BRIBE: అమిత్ షా డైరెక్షన్ లోనే ఎమ్మెల్యేల బేరసారాలు! 43 మందిని కొనేందుకు రూ.1075 కోట్లు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook