Shikhar Dhawan: శిఖర్ ధావన్‌‌పై ఎందుకింత వివక్ష.. బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం!

Netizens fires on BCCI replacing KL Rahul with Shikhar Dhawan. కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా చేసి శిఖర్ ధావన్‌ను వైస్‌ కెప్టెన్‌గా మార్చిన బీసీసీఐ సెలెక్టర్లపై నెటిజన్లు మండిపడుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 12, 2022, 02:09 PM IST
  • శిఖర్ ధావన్‌‌పై ఎందుకింత వివక్ష
  • ఇది ధావన్‌ను అవమానించడమే
  • బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం
Shikhar Dhawan: శిఖర్ ధావన్‌‌పై ఎందుకింత వివక్ష.. బీసీసీఐపై నెటిజన్ల ఆగ్రహం!

Netizens fires on BCCI replacing KL Rahul with Shikhar Dhawan: జింబాబ్వేలో పర్యటించనున్న భారత వన్డే జట్టు కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జింబాబ్వే సిరీస్‌కు ముందుగా సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించగా.. ఇప్పుడు గబ్బర్ స్థానంలో స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ను సారథిగా బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయాలు, ఆపరేషన్, కరోనా అనంతరం రాహుల్‌ తిరిగి ఫిట్‌నెస్ సాధించడంతో అతడిని కెప్టెన్‌గా చేసి ధావన్‌ను వైస్‌ కెప్టెన్‌గా మార్చారు. 

కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా చేసి శిఖర్ ధావన్‌ను వైస్‌ కెప్టెన్‌గా మార్చిన బీసీసీఐ సెలెక్టర్లపై అటు అభిమానులు, ఇటు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ధావన్‌ను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిఖర్ ధావన్‌‌పై ఎందుకింత వివక్ష అంటూ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. జింబాబ్వే పర్యటనకు ముందే జట్టును బీసీసీఐ ప్రకటించకుండా ఉండాల్సిందని, శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు కాబట్టి అతడినే కొనసాగిస్తే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. 

శిఖర్ ధావన్‌ వెస్టిండీస్ పర్యటనలో 3-0తో వన్డే సిరీస్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్‌ భారత జట్టులో చాలా రోజుల తర్వాత ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్సీ చేసిన రాహుల్‌.. తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. వెస్టిండీస్‌ పర్యటనకు ముందు కోలుకున్నా.. అతడికి కరోనా సోకడంతో ఆడలేకపోయాడు. ఇప్పుడు ఫిట్‌నెస్‌ సాధించడంతో రాహుల్‌ జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలోనూ వైస్‌ కెప్టెన్‌ కావడంతో జట్టు పగ్గాలు దక్కాయి.

భారత జట్టు:
కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శుబ్‌మన్‌ గిల్, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్‌ ఠాకూర్, కుల్దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, ప్రసిధ్‌ కృష్ణ, దీపక్‌ చహర్, మొహమ్మద్‌ సిరాజ్‌.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.6799 ధరకే ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్ 6 HD ఫోన్‌! 5000mAh బ్యాటరీ

Also Read: Diabetes Diet: మధుమేహం ఉన్నావారు కూడా ఈ తీపి పదార్థాలను తినొచ్చు.. ఇవి కూడా డయాబెటిస్‌కు చెక్‌ పెడుతాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News